మెగా క్యాంప్ పై.. మరోసారి పరుషపదజాలంతో రెచ్చిపోయిన నరేష్..!

naresh serious comments on prakash raj panel
naresh serious comments on prakash raj panel
naresh serious comments on prakash raj panel
naresh serious comments on prakash raj panel

‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి అనైతికంగా గెలిచారంటూ మా సభ్యత్వానికి మూకుమ్మడి రాజీనామాలు చేసి ప్రకాశ్ రాజ్ ప్యానల్ సంచలనం సృష్టించింది. అంతేకాదు ప్రెస్ మీట్ పెట్టి మరి మోహన్ బాబు రౌడీయిజం చేశారని.. పచ్చి బూతులు తిడుతూ కొట్టడానికి వచ్చారని బెనర్జీ, ఉత్తేజ్, తనీష్ లాంటోళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక దాసరి లేని లోటు మోహన్ బాబు తీరుస్తారని షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు నరేష్ పై కూడా భారీ విమర్శలు చేశాడు. నరేష్ చుట్టే విమర్శల పర్వం కొనసాగింది. నిన్నంతా నడిచిన ఈ హైడ్రామాపై తాజాగా నరేష్ స్పదించాడు. ఓడిపోయిన వారు ఆరోపణలు చేయటం ఎందుకు? ముండమోపిలా ఆ ఏడుపులు ఎందుకు అంటూ పరుషపదజాలంతో ప్రకాశ్ రాజ్ ప్యానల్ పై రెచ్చిపోయాడు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ‘విష్ణు బాధ్యతలు చేపట్టడంతో తనకు సంతోషంగా ఉందన్నారు. ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని.. ‘మా’ ఒక సేవా సంస్థ అని పేర్కొన్నారు.

ఎన్నికలు అయిపోయాక ఆరోపణలు ఎందుకని ప్రశ్నించారు. ముండమోపిలా ఏడుపులెందుకు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు నరేశ్. ఇక అతిగా నవ్వే ఆడవాళ్ళని, అతిగా ఏడిచే మొగవాళ్లని నమ్మొద్దని సెటైర్స్ వేశాడు. గెలుపు ఓటములు పక్కన పెట్టి అందరు కలిసి పనిచేయాలని.. ‘మా’లో పెత్తందారీ వ్యవస్థ పోవాలని.. ఒక్కరి చుట్టూ పెద్దరికం నడవొద్దని ఇన్ డైరెక్ట్ గా మెగా క్యాంపై విమర్శలు చేశాడు నరేష్. ఇక నెల నెల ప్రశ్నిస్తా అంటూ కొందరు అంటున్నారు.. చూద్దాం వారు ఏం ప్రశ్నిస్తారో అంటూ ప్రకాశ్ రాజ్ కి కౌంటర్ ఇచ్చాడు. మా ఎలక్షన్స్ అనౌన్స్ మెంట్ నుండి మాటలు డైనమెట్లా పేలుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత అయినా పరిణామాలు మారుతాయి అనుకుంటే.. ఇప్పుడు గొడవలు తారాస్థాయికి చేరి ఇండస్ట్రీలో కుల ఘర్షణలు చెలరేగేలా ఉన్నట్లు కనిపిస్తోంది.పెద్దలెవరైనా ముందుకొచ్చి ఈ గొడవలని నిలువరించకపోతే మా అసోసియేష పరువు మరింత పోయేలా కనిపిస్తుంది.