నా కళ్ళ ముందు హీరో అయ్యావ్.. జాగ్రత్తగా మాట్లాడు.. శ్రీకాంత్ పై నరేష్ ఫైర్..!

actor naresh serious on hero srikanth comments about sai dharam tej accident
actor naresh serious on hero srikanth comments about sai dharam tej accident
actor naresh serious on hero srikanth comments about sai dharam tej accident
actor naresh serious on hero srikanth comments about sai dharam tej accident

‘మా’లో హీట్. సాయి ధరమ్ తేజ్ ఆక్సిడెంట్ తరువాత మా సభ్యుల్లో వివాదాలు మరింత ముదురుతున్నాయి. బైక్ రైడ్ విషయంలో నరేష్ వీడియోకి పలువురు కౌంటర్ ఇచ్చారు. తేజ్ ప్రమాదం పై నటుడు నరేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. నరేష్ మాటలను పలువురు ప్రముఖులు తప్పబట్టారు. హీరో శ్రీకాంత్ కూడా నరేష్ ని ఉద్దేశించి కొంచం ఘాటు వ్యాఖ్యలే చేశాడు. ‘నాకు నరేష్ గారు పెట్టిన బైట్ బాధ కలిగించింది, ఇంకెవరు ఇలాంటి బైట్స్ పెట్టొద్దు’ అంటూ శ్రీకాంత్ కామెంట్స్ చేశాడు. దీంతో నరేష్ కూడా జాగ్రత్త శ్రీకాంత్ అంటూ రీ కౌంటర్ ఇచ్చాడు.

మొదట బైట్ ఇచ్చిన నరేష్ పై శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘తేజ్ ర్యాష్ గా వెళ్లే వ్యక్తి కాదు. ఈ టైం లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో టెన్షన్ లో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో నరేష్ గారు తేజ్ లాంటి వ్యక్తి గురించి పెట్టిన బైట్ నచ్చలేదు. చనిపోయిన వ్యక్తుల గురించి నరేష్ మాట్లాడటం అంత మంచిది కాదేమో అనిపించింది. ఇక దయచేసి ఇలాంటి బైట్స్ ఎవరు పెట్టొద్దు’ అంటూ కామెంట్ చేశాడు శ్రీకాంత్. ఇక శ్రీకాంత్ వ్యాఖ్యలపై నరేష్ కౌంటర్ బైట్ పెట్టాడు. తానూ కాదు నువ్వే అలోచించి మాట్లాడు.. 50సంల నా ఇండస్ట్రీ అనుభవంలో ఇంతవరకు నాగురించి ఎవరు ఇలా మాట్లాడలేదు అంటూ నరేష్ శ్రీకాంత్ పై ఫైర్ అయ్యాడు.

నరేష్ మాట్లాడుతూ ‘శ్రీకాంత్.. నా బైట్ మీద నువ్విచ్చిన బైట్ నేను చూశాను. ఏంటమ్మా అలా ఇచ్చావ్ బైట్. బైట్స్ ఇచ్చేముందు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చనిపోయిన వారి గురించి నేను చెప్పలేదు. బైకులు మనం చాక్లెట్స్ లా పిల్లలకు ఇవ్వలేం. వాళ్లంతా అడల్ట్స్. నువ్వు మాట్లాడిన మాటలకూ నేను హార్ట్ అయ్యాను. నా కళ్ళ ముందు నువ్వు హీరోగా రావటం చూశాను. మంచి సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నావు. మా ఎలెక్షన్స్ లో పోటీ చేసి నా ప్యానెల్ ముందు ఓడిపోయావ్. ఇంకోసారి ఇలాంటి బైట్స్ ఇవ్వొద్దు. జాగ్రత్తగా మాట్లాడు. 50ఏళ్ళ నా సినీ కెరీర్ లో నన్ను ఇంతవరకు ఎవరు ఇలా అనలేదు. ఇంకోసారి ఇలాంటివి చేయకు’ అంటూ శ్రీకాంత్ కి గట్టి కౌంటర్ ఇచ్చాడు నరేష్.