‘మా’ వివాదంలో కొత్త ట్విస్ట్.. ప్రకాష్ రాజ్ కోసం రంగంలోకి పోలీసులు.. షాక్ లో మంచు విష్ణు..!

actor prakash checking cctv footage of maa elections with police
actor prakash checking cctv footage of maa elections with police
actor prakash checking cctv footage of maa elections with police
actor prakash checking cctv footage of maa elections with police

‘మా’లో మంటలు ఇప్పట్లో తగ్గేలా కనిపించటం లేదు. మొన్నటివరకు గెలుపే ద్యేయంగా పనిచేసిన ప్రకాష్ రాజ్ ప్యానల్.. తాజాగా సిసి టీవీ ఫ్యూటేజ్ చుట్టూ తమ రాజకీయాలని నడుపుతుంది. మా ఎన్నికల్లో తమపై దాడులు జరిగాయని, మంచు విష్ణు ప్యానల్ సభ్యులు అక్రమాలు చేసి గెలిచారాని ప్రకాష్ రాజ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. మరికొద్ది రోజుల్లో కోర్టు మెట్లు కూడా ఎక్కనున్నట్లు తెలుస్తుంది. అందుకే పూర్తి సాక్షాదారాలను సేకరించే పనిలో భాగంగా.. మా ఎన్నికల దెగ్గర జరిగిన గొడవలను చూపెట్టాలని.. సీసీ పుటేజ్‌లో దాడి విజువల్స్‌ అన్ని ఉన్నాయని.. తమకు సీసీ పుటేజ్‌ కావాలని జూబ్లీహిల్స్‌ పోలీసులను కోరారు ప్రకాష్ రాజ్.

దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎన్నికలు జరిగిన జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూలుకు పోలీసులు చేరుకొని సీసీ పుటేజ్ రికార్డైన సర్వర్‌ రూమ్‌ను పరిశీలిస్తున్నారు. ప్రకాష్‌రాజ్‌కు సీసీ పుటేజ్‌ చూపిస్తున్నారు. ప్రకాశ్ రాజ్‌తో మరికొందరు సభ్యులు అక్కడికి చేరుకున్నారు. అయితే విష్ణు ప్యానల్‌కు సంబంధించిన సభ్యులు ఎవరూ అక్కడికి రాలేదు.