ఆ చట్టాలు అమలైతే.. సాగుకు కరెంట్ ఉండదు

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విద్యుత్ చట్టం అమలైతే సాగుకు ఉచిత కరెంటు ఉండదని ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. వ్యవసాయం కష్టమవుతుందని, రైతు బీమా, రైతుబంధు లాంటి పథకాలు అమలు చేసే అవకాశం ఉండదని తెలిపారు. నల్ల చట్టాలు అమలైతే దేశంలో రైతులకు గడ్డుకాలమేనని ఆయన అన్నారు.


వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన ధర్నాను కొంతమంది విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. లఖింపూర్ ఖేరి ఘటన బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్య, వైద్యం, బ్యాంకు, బీమా రంగాలను కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తున్నదని ఆయన విమర్శించారు.