బండ్ల గణేష్ కి పోటీగా.. మా ఎన్నికల బరిలో రఘుబాబు..!

actor raghu babu to contest in maa elections from manchu vishnu panel
actor raghu babu to contest in maa elections from manchu vishnu panel
actor raghu babu to contest in maa elections from manchu vishnu panel
actor raghu babu to contest in maa elections from manchu vishnu panel

టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతున్న మూవీ ఆర్టిస్ట్ ఎలెక్షన్స్ పై ప్రజల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 10న              మా ఎన్నికలు జరగనుండగా.. మంచు విష్ణు, ప్రకాష రాజ్ లు అధ్యక్ష పదవి కోసం ప్రధాన పోటీదారులుగా ఉన్నారు.       ఈ క్రమంలో ఇప్పటికే తన ప్యానల్ ని ప్రకటించి కొంచం దూకుడు మీదున్నాడు ప్రకాష్ రాజ్. అయితే మంచు విష్ణు కూడా తన లాబీయింగ్ తో ఎలెక్షన్స్ లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో మంచు విష్ణు ప్యానల్ నుంచి ఓ కీలక నటుడి పేరు బయటకు వచ్చింది.

నటుడు రఘుబాబు ప్రధాన కార్యదర్శి పదవి కోసం విష్ణు ప్యానల్‌ నుంచి పోటీలోకి దిగుతున్నారు. ఈ మేరకు ఆయన జనరల్‌ సెక్రటరీగా విజయం సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఈ పదవి గురించి ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఇప్పటికే పెద్ద రచ్చ కొనసాగుతుంది. అధ్యక్ష బరిలో ఉన్న జీవితను.. తన ప్యానల్ లో చేర్చుకుని జనరల్‌ సెక్రటరీ పదవి కోసం పోటీకి దిగే అవకాశమిచ్చారు ప్రకాష్ రాజ్. దీంతో అలిగిన బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి తప్పుకుని జనరల్‌ సెక్రటరీ పదవి కోసం స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు. ఇక ఇప్పటికే ఈ పదవి కోసం జీవిత, బండ్ల గణేష్ మధ్యలో నువ్వా నేనా అన్న రేంజిలో మాటల యుద్ధం నడుస్తుండగా.. ఇప్పుడు లేటెస్ట్ గా రఘుబాబు కూడా బరిలోకి దిగటంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.