చిరంజీవి చెప్పులు తీస్తుంటే.. పట్టుకున్న రవితేజ.. వీరిద్దరే అసలైన హీరోలు.. !

Actor Raviteja Shows His Love On Megastar Chiranjeevi
Actor Raviteja Shows His Love On Megastar Chiranjeevi

తెలుగు చిత్ర పరిశ్రమలోని ఇప్పుడున్న హీరోల్లో సొంత కష్టంతో స్టార్ హీరో అయ్యింది మెగా స్టార్ చిరంజీవి ఒక్కడే. బాలయ్య, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలా వీరందరూ బ్యాక్ గ్రౌండ్ తో ఎదిగిన వారే. అయితే చిరు తరువాత గాడ్ ఫాదర్ లేకుండా స్టార్ హీరో అయ్యాడు మాస్ రాజా రవితేజ. అందుకే రవితేజ, చిరంజీవిలకి మాస్ లో సపరేట్ ఫాలోయింగ్ ఉంటుంది. అలంటి వీరిద్దరూ ఒకే చోట కనిపిస్తే వీరి ఫ్యాన్స్ కి పండగే. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రావణాసుర’ అనే కొత్త చిత్రం పూజ కార్యక్రమం ఈ రోజు జరుగగా.. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్టుగా వచ్చాడు. ఈ సందర్భంలో చిరంజీవి రవితేజ మధ్య ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మెగాస్టార్ కి పెద్ద అభిమాని అయినా రవితేజ.. చిరుపై ప్రేమని చాటుకున్నాడు. కెరీర్ మొదట్లో రవితేజకి ‘అన్నయ్య’ వంటి సినిమాల్లో ఆఫర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసిన చిరంజీవి అంటే రవితేజకి ఎంత అభిమానమో ఈ ఒక్క సీన్ చూస్తే అర్ధమవుతుంది.

‘రావణాసుర’ చిత్రం ఓపెనింగ్ ఫంక్షన్ కి గెస్టుగా వచ్చిన చిరంజీవి.. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుతో కలిసి పూజ కార్యక్రమం కోసం లోపలికి వెళ్తూ.. తన పక్కనున్న రవితేజ భుజంపై చేయి వేసి కాళ్ళకి చెప్పుల్ని తొలగించబోయాడు. దీంతో కాస్త బ్యాలెన్స్ అవుట్ అవుతుంటే చిరంజీవిని తన చేతితో పట్టుకుంటాడు రవితేజ. ఇక అటు పక్కనున్న దర్శకుడు సుధీర్ వర్మ చెయ్యి పట్టుకుని మరో చెప్పని తొలగిస్తాడు. అప్పటివరకు చిరంజీవిని రవితేజ పట్టుకునే ఉంటాడు. సొంత కష్టంతో పైకి వచ్చిన ఇద్దరు స్టార్ హీరోల ఈ లవ్లీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అన్నయ్య అంటే రవితేజకి ఎంత అభిమానం అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో వీరు ఇద్దరే రియల్ హీరోస్ అంటూ మరికొందరు కితాబులు ఇస్తున్నారు. ఇక మాస్ రాజా రవితేజ, డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్ వస్తున్న ఈ “రావణా సుర” చిత్రం సెప్టెంబర్ 30,2022 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నట్టు.. విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియా లో నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ వైరల్ అయ్యింది.