చాల నొప్పిగా ఉంది పద్దూ.. భార్య చనిపోయాక.. తొలిసారి ఉత్తేజ్ కన్నీటి లేఖ..!

Actor Uttej Emotional Post On His Wife Padma Birthday
Actor Uttej Emotional Post On His Wife Padma Birthday

ప్రముఖ నటుడు, రచయిత ఉత్తేజ్ ఇంట మొన్న తీవ్ర విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. క్యాన్సర్ వ్యాధితో బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉత్తేజ్ భార్య పద్మావతి మృతి చెందగా.. మెగాస్టార్ చిరంజీవి, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖులు నివాళులు అర్పించి ఉత్తేజ్ ని ఓదార్చారు. అయితే భార్య మరణంతో ఉత్తేజ్ ఎంత ఎమోషనల్ అయ్యాడో అందరికి తెలిసిందే. చిరంజీవిని పట్టుకుని ఉత్తేజ్ రోదించిన తీరు అందర్నీ కన్నీళ్లు పెట్టించింది. భార్య అంటే ఉత్తేజ్ కి ఎంత పిచ్చి ప్రేమ అంటూ కామెంట్స్ చేశారు.

అయితే నేడు(నవంబర్‌ 24) ఉత్తేజ్ భార్య పద్మ పుట్టిన రోజు. గతేడాది పుట్టిన రోజుకు పక్కనే ఉన్న భార్య.. ఇప్పుడు లేకపోవడంతో ఉత్తేజ్‌ మరోసారి భావోద్వేగానికి గురవుతూ.. సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశాడు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు పద్దమ్మ… ఉన్నంత కాలం నాకు పరిష్కారమై.. ఇపుడు ప్రశ్న నిచ్చి వెళ్ళావు.. చాలా నొప్పి పద్దు… నా చివరిశ్వాస తోనే నువ్వు నాలోంచి వెళ్ళేది…. లవ్ యూ పద్దమ్మా. మయూఖ పిల్లలంతా నిన్ను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు…’అని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.