మా అమ్మని తిట్టారు.. నా భార్య చనిపోతే ఒక్కడు రాలేదు.. తీవ్ర ఆవేదనతో ఉత్తేజ్ కన్నీళ్లు..!

Actor Uttej Resign From Maa Association Emotional Comment On Naresh And Manchu Vishnu
Actor Uttej Resign From Maa Association Emotional Comment On Naresh And Manchu Vishnu
Actor Uttej Resign From Maa Association Emotional Comment On Naresh And Manchu Vishnu
Actor Uttej Resign From Maa Association Emotional Comment On Naresh And Manchu Vishnu

మా ఎన్నికల రాజకీయాలు రోజుకొక ట్విస్ట్ తో క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తలపిస్తుంది.తీవ్ర ఉత్కంఠత నడుమ జరిగిన మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ పై మంచు విష్ణు సంచలన విజయం సాధించాడు. ఇక ఇక్కడితో గొడవలు సద్దుమణుగుతాయని.. అందరు కలిసి పనిచేస్తారని బావించారంతా.. కానీ అలా జరుగుతే మా స్పెషలిటీ ఏముంటుంది. అందరి అంచనాలని తలకిందులు చేస్తూ తాజాగా ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులందరు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా తన ప్యానల్ సభ్యులతో ప్రకాష్ రాజ్ మీడియా సన్నివేశం ఏర్పాటు చేసి మరి రాజినామాలని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు మంచు విష్ణుపై, మోహన్ బాబు పై సంచలన కామెంట్స్ చేశారు.

నన్ను బండబూతులు తిడుతూ మోహన్ బాబు కొట్టడానికి వచ్చారని బెనర్జీ కన్నీటి పర్యంతం అయ్యాడు. నన్ను బౌన్సర్లతో కొట్టించడానికి మంచు విష్ణు ట్రై చేశాడని యువ హీరో తనీష్ ఆరోపణలు చేస్తే.. నా తమ్ముడు వయసుండే మంచు విష్ణు నాపై గట్టిగట్టిగా అరిచాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు ఈటివి ప్రభాకర్. ఇక నటుడు ఉత్తేజ్ అయితే మా అమ్మని కూడా తిట్టారు అంటూ మోహన్ బాబు ఫ్యామిలీపై సంచలన ఆరోపణలు చేశాడు. మా భార్య చనిపోతే కనీసం ఇప్పటివరకు నరేష్ కానీ ఇంకెవ్వరు నన్ను పరామర్శించలేదని ప్రెస్ మీట్ పీట్ లో కన్నీళ్లు పెట్టుకున్నాడు.

మూకుమ్మడి రాజీనామాల ప్రెస్ మీట్ లో ఉత్తేజ్ మాట్లాడుతూ ‘నా భార్య పద్మ చనిపోయింది. చావుబ్రతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతుంటే… మెగాస్టార్ చిరంజీవి సహా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, బెనర్జీ ఇలా అందరూ నాతో హాస్పిటల్ లో ఉన్నారు. కానీ ఆ నరేష్ మాత్రం ఒక్క ఫోన్ కాల్… ఒక్కటంటే ఒక్కటి ఫోన్ కాల్ కూడా చెయ్యలేదు. ఇక ఎలక్షన్స్ జరిగే రోజు అయితే నన్ను దారుణంగా బండ బూతులు తిట్టాడు. ఇలా చెప్పడానికే ఏదోలా ఉంది. ఒక నరేuttejష్ నా మొహంపై మొహం పెట్టి ఒక్కొక్కడి పనిచెప్తా.. అంటూ మా అమ్మని బండ బూతులు తిట్టాడు. మా అమ్మని తిడతాడా.. ఎవరు వీడు.. అంటూ ఆవేదనతో నటుడు ఉత్తేజ్ భావోద్వేగానికి గురయ్యాడు. ఇక నేను నరేష్ అధ్యక్షుడి గా ఉన్నప్పుడు ఈసీ మెంబర్ గా ఉన్నాను. అలాంటిది మా భార్య చనిపోయినప్పుడు ఒక్క ఫోన్ కాల్ పరామర్శ కూడా చెయ్యలేదు . ఈసీ మెంబర్ కే పరామర్శ చెయ్యనివాడివి సభ్యులకు ఇంకేం పరామర్శ చేస్తావు ? నువ్వు అప్పుడు పంపిణీ ల పనుల్లో ఉన్నావు, నీ పార్టీల పనుల్లో ఉన్నావు అంటూ కంటతడి పెట్టుకున్నారు ఉత్తేజ్.