డ్రెస్ విప్పనని మొండికేశా.. హెవీ బ్లీడింగ్ అయ్యింది.. షూటింగ్ లో నటి అర్చనకి చేదు అనుభవం..!

actress archana reveals interesting incidents of her career
actress archana reveals interesting incidents of her career
actress archana reveals interesting incidents of her career
actress archana reveals interesting incidents of her career

అందం అభినయం రెండు సమపాళ్లలో ఉన్న హీరోయిన్ అర్చన. అయితే రాంగ్ స్టోరీ సెలెక్షన్స్ తో పాటు కావాల్సినంత అదృష్టం కలిసిరాక కెరీర్ లో అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయింది అర్చన. దీంతో మొన్ననే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయిపోయింది. ఎప్పుడు ఎలాంటి కాంట్రవర్సీల జోలికెళ్లని అర్చన తన కెరీర్ లో కొన్ని బోల్డ్ సినిమాల్లోనూ నటించింది. వాటి అనుభవాలు.. తన ఫిలిం కెరీర్ పై సోషల్ మీడియాలో కొన్ని ఇంట్రెస్టింగ్ సంగతులని పంచుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. హీరోయిన్‌గా.. అనేక చిత్రాల్లో నటించిన వేద అలియాస్ అర్చన శాస్త్రి బిగ్ బాస్ సీజన్ 1లో మెరిసింది. ‘నేను’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటాన, శ్రీరామదాసు వంటి చిత్రాలతో మంచి క్రేజ్ దక్కించుకున్నా.. సోలో హీరోయిన్ గా రాణించలేకపోయింది. సరైన పీఆర్ లేక.. కొన్ని అనవసర కథలని ఎంచుకోవటం వల్లే హీరోయిన్ గా విజయవంతం కాలేకపోయానని చెప్పింది.

తన కెరీర్ అనుభవాల గురించి అర్చన మాట్లాడుతూ.. ‘ కమలతో నా ప్రయాణం అనే సినిమాలో కొన్ని సీన్స్ చేయటంలో చాల ఇబ్బంది పడ్డాను. అందులో వేశ్య పాత్రలో నటించాను. దాంతో కొన్ని బోల్డ్ సీన్స్ లో నటించడానికి చాల ఇబ్బంది అనిపించిది. కెమెరాని విచిత్ర యాంగిల్స్ లో పెట్టి షూట్ చేసి కవర్ చేశారు. దాంతో కాస్త బెటర్ అనిపించింది. అయితే తన కెరీర్ లో బాగా ఇబ్బందులకు గురై నటించిన సినిమా ‘నేను’. అల్లరి నరేష్ గారితో ఒక యాక్షన్ సీన్ చేసే మయంలో గుంతలో దూకేశాను. దాంతో నా కాలి చర్మం ఊడి పెద్ద గాయం అయ్యింది. నరేష్ గారు ఈజీగా దూకేయటంతో నేను ఆ పనిచేసాను. ఇప్పటికి అది గుర్తొస్తే బయం వేస్తుంది. ఇక అదే సినిమాలో మరో బోల్డ్ సీన్ చేశాను. ఒక పాటలో టాప్ విప్పే సీన్ చేయమంటే నేను విప్పనని మొండికేశాను. నేను టీమ్ అందరు వచ్చి బ్రతిమిలాడారు. మీరు జస్ట్ విప్పినట్టు చెయ్యండి. మేము అది చూపెట్టకుండా కవర్ చేస్తాం అని అన్ను కన్విన్స్ చేశారు. దాంతో నేను ఆ టాప్ విప్పే సీన్ కి అంగీకరించాను. నేను టాప్ తీయకపోయినా తీసినట్టుగా చూపిస్తారు కదా అన్న ఆలోచనలో అలా చేశా.. కానీ ఆ తరువాత అది తలుచుని నవ్వుకునేదాన్ని. ప్రొపెషనల్‌గా ఇలాంటివి తప్పవు అని పేర్కొంది అర్చన