మగాడంటే రాజశేఖర్.. నువ్వు చిరంజీవిని కూడా మోసం చేశావు.. నరేష్ నిజస్వరూపం..హేమ సంచలన వ్యాఖ్యలు..!

Actress Hema Praises Rajasekhar And Scolded Naresh
Actress Hema Praises Rajasekhar And Scolded Naresh
Actress Hema Praises Rajasekhar And Scolded Naresh
Actress Hema Praises Rajasekhar And Scolded Naresh

మా ఎన్నికల ప్రకంపనలు రోజురోజుకి హీటెక్కుతున్నాయి. ముఖ్యంగా హేమ రచ్చకెక్కి చేస్తున్న హంగామాతో మా వివాదం మరింత ముదురుతోంది. మా అధ్యక్షుడు నరేష్ ని టార్గెట్ చేస్తూ హేమ చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. నిన్న లీక్ అయిన హేమ ఆడియో మరవకముందే.. మీడియాల్లో లైవ్ షోలోకి వచ్చి మరి నరేష్ ని ఏకి పడేస్తుంది హేమ. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నరేష్ ని బండ బూతులు తిడుతూనే రాజశేఖర్ పై ప్రశంసలు కురుపించింది హేమ. ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న హేమ లేటెస్ట్ ఎంట్రీతో మా ఇష్యు మరింత వేడెక్కింది. మొన్నటివరకు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్యే పోటీ నడుస్తున్నట్టుగా కనిపించినా లేటెస్ట్ గా మా ఎన్నికల్లో హేమ చక్రం తిప్పేలానే కనిపిస్తుంది.

నిన్నటి హేమ ఆడియో టేప్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ‘మా’ నిధుల్లో ఉన్న 5కోట్లలో ఇప్పటివరకు నరేష్ ఖర్చుచేసింది 3కోట్లు మాత్రమే. మరి మిగితా 2కోట్ల పరిస్థితి ఏంటి.. దాని లెక్కలు ఎలా.. ఖచ్చితంగా ఆ రెండు కోట్లు ఎక్కడ దేనికి ఖర్చు చేసారో చెప్పాలి. అసలు నరేష్ కి అధ్యక్ష ఎన్నికలు జరగడమే ఇష్టం లేదని.. హాయిగా మరో టర్మ్ కూడా అతనే పదవిలో ఉండాలనుకుంటున్నాడని నరేష్ గుట్టు రట్టు చేస్తూ హేమ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇంకా మిగిలి ఉన్న డబ్బుని కూడా వాడుకోవాలని నరేష్ చూస్తున్నాడని, అతని ఆటలు సాగనివ్వమని నరేష్ పై చిందులేసింది హేమ. ఇక లేటెస్ట్ గా మీడియా ఇంటర్వ్యూ లో తన వ్యాఖ్యల్లో మరింత ఘాటు పెంచింది హేమ. రాజేంద్ర ప్రసాద్, శివాజీ రాజా హయాంలో తామెంతో కష్టపడి కూడ బెట్టిన ఐదు కోట్లను నరేష్ ఖర్చు పెడుతున్నారని.. ఒక్క రూపాయి కూడా ‘మా’ కోసం సంపాదించలేకపోయాడని ఆరోపిస్తునే చిరంజీవి కళ్యాణ లక్ష్మి పథకాన్ని మధ్యలోకి లాగింది హేమ.

Actress Hema Praises Rajasekhar And Scolded Naresh
Actress Hema Praises Rajasekhar And Scolded Naresh

పెళ్లి చేసుకునే ప్రతి జంటకి రెండు లక్షలు అందించే అద్భుత కార్యక్రమం కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రారంభించారు చిరంజీవి గారు. ఆ కళ్యాణ లక్ష్మి పథకంలోనూ నరేష్ పక్షపాతం చూపెట్టాడు. పెళ్లాడే ప్రతి జంటకి రెండు లక్షలు ఇస్తానంటేనే అది చిరంజీవి గారి కళ్యాణ లక్ష్మి పథకం అయ్యిందని.. కానీ ఎప్పుడు కూడా చిరంజీవి గారి పేరుని స్టేజిపై నరేష్ పలుకలేదని.. ఇది చిరంజీవి గారిని కూడా మోసం చేసినట్టే అని , ఆయనను అవమానించినట్టే అనే కోణంలో హేమ ఆరోపించారు. ఇక కళ్యాణ్ లక్ష్మి పథకానికి నరేష్ ఒక పైసా కూడా ఇవ్వలేదని చెప్పింది. ఈ విషయంలో రాజశేఖర్ మొగాడని హేమ ప్రశసంలు కురిపించింది. రాజశేఖర్ దెగ్గర ఎంత డబ్బుందో తెలియదు కానీ ఆయన కళ్యాణ లక్ష్మి కోసం 10లక్షలు ఇచ్చారు. కానీ నరేష్ మాత్రం ఏనాడూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని హేమ సంచలన కామెంట్స్ చేశారు.