‘మా’లో కలకలం రేపుతున్న..హేమ ఆడియో టేప్.. నరేష్ గుట్టురట్టు..!

Cine Actress Hema Audio Call Leaked Going Viral
Cine Actress Hema Audio Call Leaked Going Viral
Cine Actress Hema Audio Call Leaked Going Viral
Cine Actress Hema Audio Call Leaked Going Viral

మా అధ్యక్ష ఎన్నికల పేరు మీద సినీ ఇండస్ట్రీ సభ్యులు రచ్చకెక్కుతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ జనాల దృష్టిలో చీప్ అయిపోతున్నారు. సాధారణ రాజకీయ ఎన్నికల వేడిని తలపిస్తూ ఏకంగా ఐదుగురు అధ్యక్షసభ్యులు ఎన్నికల బరిలో దిగడమే కాకుండ ఇండస్ట్రీ సభ్యులను ఐదు వర్గాలుగా చీల్చి చెడుగుడు ఆడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్న నటి హేమ ఆడియో టేప్ లీక్ అవ్వటం ఇండస్ట్రీలో కలకలంగా మారింది. ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసి హేమ హాట్ టాపిక్ అయ్యారు. ఎన్నికలు జరగకుండా చూసి అధ్యక్ష పదవిలో ఆయనే కొనసాగాలనుకుంటున్నాడని.. దానికోసమే ఎత్తులు వేస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేసింది. ఇక నరేష్ పై మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన మా ఉపాధ్యక్షురాలు హేమ వాయిస్ టేప్ ఇండస్ట్రీలో ఇప్పుడు కలకలం రేవుతుంది.

హేమ మాట్లాడిన ఈ వాయిస్ మెసేజ్ లో నరేష్ అధ్యక్ష పదవి నుండి దిగిపోయి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంది. ‘మా’ నిధుల్లో ఉన్న 5కోట్లలో ఇప్పటివరకు నరేష్ ఖర్చుచేసింది 3కోట్లు మాత్రమే. మరి మిగితా 2కోట్ల పరిస్థితి ఏంటి.. దాని లెక్కలు ఎలా.. ఖచ్చితంగా ఆ రెండు కోట్లు ఎక్కడ దేనికి ఖర్చు చేసారో చెప్పాలి. అసలు నరేష్ కి అధ్యక్ష ఎన్నికలు జరగడమే ఇష్టం లేదని.. హాయిగా మరో టర్మ్ కూడా అతనే పదవిలో ఉండాలనుకుంటున్నాడని గుట్టు రట్టు చేస్తూ హేమ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇంకా మిగిలి ఉన్న డబ్బుని కూడా వాడుకోవాలని నరేష్ చూస్తున్నాడని, అతని ఆటలు సాగనివ్వమని, వెంటనే ఎన్నికలు జరిగేలా మా కార్యవర్గంలోని 200మందికి బహిరంగ లేఖలు రాసి.. సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది హేమ. ఇక అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న వారిలో హేమ కూడా ఒకరు. హేమతో పాటు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, సీవీఎల్ నరసింహారావులు కూడా ఎన్నికలో బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

 

హేమ ఆడియో టేప్ కలకలం.. బయటపడ్డ నరేష్ బండారం