చనిపోతానని అనుకున్నా.. ఎట్టకేలకు నోరువిప్పిన సమంత..!

Samantha Thought To Die After Divorce With Naga Chaitanya
Samantha Thought To Die After Divorce With Naga Chaitanya

నాగచైతన్య, సమంతల జీవితంలో విడాకుల అంశం ఒక చీకటి అధ్యాయం. ఎంతో ఇష్టపడి ఒకటైన ఈ జంట నాలుగు సంవత్సరాల వైవాహిక జీవితానికి మనస్పర్థలతో స్వస్తి చెప్పేశారు. అయితే వీరిద్దరి మధ్య గొడవలకి కారణమేంటని మాత్రం ఇప్పటివరకు ఎవ్వరికి తెలియని సీక్రెట్. సోషల్ మీడియాలో ఈ అంశంపై అనేక రూమర్స్ వచ్చాయి. ముఖ్యంగా విడాకులకు సమంతనే కారణమని పర్సనల్ గా టార్గెట్ చేశారు. దీంతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న కొన్ని సోషల్ మీడియా ఛానెల్స్ పై సామ్ కోర్టుకి కూడా ఎక్కింది. అయితే మనస్పర్థలకు కారణం ఏంటని తన వ్యక్తిగత అంశాలపై ఇప్పటివరకు స్పందించని సమంత… తొలిసారి ఒక బాలీవుడ్ మీడియాతో అన్ని అంశాలపై నోరువిప్పింది. విడాకుల తరువాత నీతి సూక్తుల కొటేషన్స్, తన సినిమా అప్డేట్స్ ని మాత్రమే సోషల్ మీడియాలో పంచుకున్న సామ్ తన వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలపై స్పందించింది.

ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. ‘నేను 2021లో జాగ్రత్తగా వేసుకున్న ప్లాన్స్ అన్నీ కుప్పకూలాయి. మీరు ఏదైనా పనిని మధ్యలోనే ఆపివేస్తే దాన్ని వెంటనే అంగీకరించండి. సమస్యలతో పోరాడుతునే ఉండండి.. ఇది ఎప్పటికీ అంతంలేని ఓ యుద్ధం. నేను ఇంకా నా జీవితాన్ని గడపాల్సి ఉందని నాకు తెలుసు. ప్రస్తుతం వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న అన్ని సమస్యలతో పోరాడుతూ నేను ఎంత బలంగా ఉన్నానని నేనే ఆశ్చర్యపోతున్నాను. నేను చాలా బలహీనురాలిని అనుకున్నాను. విడిపోయిన తర్వాత కృంగిపోయి చనిపోతానని అనుకున్నాను. కానీ ఇంత స్ట్రాంగ్ గా ఉండగలనని అనుకోలేదు. ఈరోజు ఇలా ఉన్నానంటే నాకు చాలా గర్వంగా ఉంది.. ఇలా ఎలా ఉన్నానో నాకు తెలియడం లేద’ అని సమంత చెప్పుకొచ్చింది. ఇక తన విడాకుల ప్రకటన తర్వాత తనపై వస్తున్న ట్రోలింగ్ పై సమంత మాట్లాడింది. ”నేను షరతులు లేని అంగీకారాన్ని డిమాండ్ చేయను. డిఫరెంట్ ఒపీనియన్స్ కలిగి ఉండమని నేను అందరినీ ప్రోత్సహిస్తాను. అయితే మనం ఒకరినొకరం ప్రేమించుకోవచ్చు మరియు కరుణించవచ్చు. కాకపోతే వారి నిరాశను మరింత నాగరికంగా వ్యక్తం చేయమని మాత్రమే నేను వారిని అభ్యర్థిస్తాను” అని సమంత వ్యాఖ్యానించింది.