అంబానీకి షాక్‌ ఇచ్చిన అదానీ

adani beats ambani

ఆసియా బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ముఖేష్‌ అంబానీకి  గౌతమ్‌ అదానీ షాక్ ఇచ్చాడు. 2015 నుంచి ప్ర‌తి ఏడాది ఇండియాలో అత్యంత సంపన్నుడిగా తొలిస్థానంలో ఉంటూ వస్తున్న అంబానీని అదానీ బీట్ చేశాడు. తాజా లెక్కల ప్ర‌కారం  అంబానీని వెనక్కి నెట్టి ఆసియా బిలియనీర్ల జాబితాలో అదానీ అగ్రస్థానంలో నిలిచారు.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ జాబితాలో అదానీ ప్రస్తుత నికర విలువ 88.8 బిలియన్ అని సూచించింది. అదానీ నికర విలువ కంటే కేవలం 2.2 బిలియన్ డాలర్లు తక్కువగా ముఖేష్ అంబానీ ఉన్నారు. ఆరామ్‌కోతో డీల్‌ బ్రేక్‌ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 1.77% పడిపోగా.. అదానీ షేర్లు 2.34% జంప్ చేయడంతో అదానీ ఆస్తులు పెరిగి అంబానీ ఆస్తులు తగ్గుముఖం పట్టాయి.

నివేదికల ప్రకారం ఏప్రిల్ 2020 నుండి అదానీ నికర విలువ బాగా పెరిగింది. మార్చి 18, 2020న అతని నికర విలువ 4.91 బిలియన్‌ డాలర్లు ఉండగా.. కేవలం 20 నెలల్లో 83.89 బిలియన్ డాలర్లు(1808 శాతం) కుపైగా పెరిగింది. అదే సమయంలో అంబానీ నికర విలువ 54.7 బిలియన్ డాలర్లు(250 శాతం) మాత్రమే పెరిగింది.