ఆర్యన్‌ ఖాన్‌ బెయిల్‌ పిటిషన్ పై విచారణ వాయిదా - TNews Telugu

ఆర్యన్‌ ఖాన్‌ బెయిల్‌ పిటిషన్ పై విచారణ వాయిదామాదకద్రవ్యాల కేసులో అరెస్టయిన బాలీవుడ్ సూపర్‌స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ బెయిల్‌ విచారణ రేపటికి రోజుకు వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి బెయిల్ పిటీషన్ విచారణ కొనసాగనుంది.

అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాతో ఆర్యన్‌ ఖాన్‌కు సంబంధం ఉందని నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) కోర్టుకు చెప్పింది. ఈ సమయంలో బెయిల్ ఇస్తే విచారణకు ఆటంకం కల్గుతుందని కోర్టుకు తెలిపింది.

ఆర్యన్‌ఖాన్‌ ను పట్టుకున్న సమయంలో అతడి దగ్గర ఎలాంటి మాదకద్రవ్యాలు లభ్యం కాలేదని స్పష్టం చేసిన ఎన్సీబీ.. ఆర్యన్‌తోపాటు అరెస్టయిన అర్బాజ్‌ దగ్గర 6 గ్రాముల చరాస్‌ (మత్తు పదార్థం) దొరికిందని కోర్టుకు చెప్పింది. ఎన్సీబీ దాడి చేసిన సమయంలో ఆర్యన్ రేవ్‌ పార్టీ జరుగుతున్న క్రూజ్‌ నౌకలోనే లేడని అతని తరఫు న్యాయవాది వాదించాడు.