అదరగొట్టిన ఆఫ్ఘాన్.. 60 పరుగులకే ఆలౌట్ అయిన స్కాట్లాండ్

afganistan Won The Match by 130 Runs
afganistan Won The Match by 130 Runs

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు తలపడిన ఆఫ్ఘానిస్తాన్, స్కాంట్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. అటు బ్యాటింగ్ లో, ఇటు బౌలింగ్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. నిర్ణీత 20 ఓవర్లో స్కాట్లాండ్ కి 190 పరుగుల లక్ష్యాన్నిచ్చిన ఆఫ్ఘాన్ లక్ష్య చేధనకు వచ్చిన స్కాట్లాండ్ ని కేవలం 60 పరుగులకే ఆలౌట్ చేసి ఘన విజయం సాధించింది.

afganistan Won The Match by 130 Runs
afganistan Won The Match by 130 Runs

స్కాట్లాండ్ బ్యాటర్లలో మున్సీ 25 పరుగులు, గ్రీవ్స్ 12 పరుగులు తప్ప మిగతా ఎ వరూ రాణించలేదు. దీంతో స్కాట్లాండ్ కి ఘోర పరాజయం తప్పలేదు. విరుచుకుపడిన ఆఫ్ఘాన్ బౌలర్లు.. స్కాట్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఆఫ్ఘాన్ బౌలర్ ముజీబీ ఉర్ రెహమాన్ 5 వికెట్లు తీయగా..రషీద్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టాడు. నవీన్ ఉల్ హక్ ఒక వికెట్ తీసుకున్నాడు.