అన్నాచెల్లెలి అనుబంధానికి ప్రతీకగా నిలచేది రక్షా బంధన్. ఈ పండుగ రోజు తమ అన్నదమ్ములకు రాఖీ కట్టడం కోసం సోదరీమణులు ఎక్కడున్నా పుట్టింటికి చేరుకుంటారు. తమ సోదరుల చేతికి రాఖీ కట్టి, నోరు తీపి చేస్తారు. ఈ నేపథ్యంలో రక్షా బంధన్ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తరప్రదేశ్‌లోని ఒక స్వీట్ షాప్ ‘గోల్డెన్ ఘెవర్’ అనే స్వీటును విక్రయిస్తోంది. ఆగ్రాలోని బ్రిజ్ రసాయన్ మిఠాయి భండార్ అనే స్వీటు షాప్ ప్రత్యేకంగా 24 క్యారెట్ బంగారు పూతతో తయారు చేసిన ఈ స్వీట్‌కు ప్రజల నుంచి భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. ఈ స్వీటును మైదా, నెయ్యి, షుగర్ సిరప్ మరియు కొన్ని డ్రై ఫ్రూట్స్‌తో తయారుచేస్తారు. ఈ వంటకం శ్రావణ మాసం, తీజ్ మరియు రక్షా బంధన్ పండుగల సమయంలో ఎక్కువగా అమ్మకం అవుతూ ఉంటుంది. ఈ స్వీటును 24-క్యారెట్ల బంగారం యొక్క పలుచని పొరతో తయారుచేయడం వల్ల కిలోకు రూ. 25 వేల వరకు ధర పలుకుతోంది. ఆర్డర్లపైనే తాము గోల్డెన్ ఘెవర్ స్వీట్‌ను ఆఫర్ చేస్తన్నామని స్వీట్ షాపు యజమాని తెలిపారు. సాధారణంగా ఘెవర్ స్వీట్ కిలో రూ 600 నుంచి రూ 800 మధ్య లభిస్తుంది. ఇక గోల్డెన్ ఘెవర్కు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది ఆగస్టు 11, గురువారం రక్షా బంధన్ పండుగ జరుపుకోనున్నారు. అందులో భాగంగా దేశవ్యాప్తంగా పలు దుకాణాలలో బహుమతులు, డెజర్ట్‌లు మరియు రాఖీల విక్రయం ప్రారంభమైంది.
#WATCH उत्तर प्रदेश: रक्षा बंधन को लेकर आगरा में खास तौर पर 'गोल्डन घेवर' बनाए जा रहे हैं। गोल्डन घेवर की कीमत 25,000 रुपए प्रति किलो है। इस घेवर की खासियत ये है कि इसके ऊपर 24 कैरेट के सोने की परत लगाई गई है। pic.twitter.com/cn1AQOyq8X
— ANI_HindiNews (@AHindinews) August 2, 2022