ఎయిర్‌ టెల్‌ ప్రీపెయిడ్‌ ఛార్జీల పెంపు

airtel

భారతీ ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ ఛార్జీల(టారిఫ్‌)ను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.  వాయిస్‌ ప్లాన్‌లపై 20 శాతం, అపరిమిత ఉచిత వాయిస్‌ కాల్స్‌ ప్లాన్లపై 25 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. పెరిగిన ఛార్జీలు నవంబరు 26 నుంచి అమల్లోకి రానున్నట్లు ఎయిర్ టెల్ వెల్లడించింది.

ఈ పెంపుతో ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) రూ.200-300కు చేర్చాలని ఎయిర్‌టెల్‌ భావిస్తోంది. ఏఆర్‌పీయూ ఆదాయం పెరగడం వల్ల నెట్‌వర్క్‌లు, స్పెక్ట్రం కొనుగోళ్లలో గణనీయ పెట్టుబడులకు అవకాశం ఏర్పడుతుందని ఎయిర్‌టెల్‌ తెలిపింది. భారత్‌లో 5జీ అమలుకు కూడా ఇది దోహదం చేస్తుందని పేర్కొంది.