వాళ్ల ప్యానెల్ కు మద్దతిస్తేనే సినిమాల్లో అవకాశమిస్తానన్నారు.. డైరెక్టర్ ట్వీట్ వైరల్

ajay bhupathi Tweet Goes Viral About Maa Election
ajay bhupathi Tweet Goes Viral About Maa Election

మా ఎన్నికల వివాదం రోజురోజుకు ముదురుతోంది. మా అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ మధ్య మాటల యుద్ధం రోజురోజుకు పెరుగుతోంది. మరో మూడు రోజుల్లో జరుగనున్న మా ఎన్నికలను పోటీదారులతో పాటు.. సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా సవాల్ గా తీసుకున్నారు. ఈ క్రమంలో మా ఎన్నికల గురించి ఎవరు ఏం మాట్లాడినా అది సంచలనంగా మారుతోంది. ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి మా ఎన్నికల్లోని ఓ ప్యానెల్ మీద చేసిన ట్వీట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతూ.. తెగ వైరల్ అవుతోంది.

ajay bhupathi Tweet Goes Viral About Maa Election
ajay bhupathi Tweet Goes Viral About Maa Election

మా ఎన్నికల గురించి మాట్లాడిన అజయ్ భూపతి.. ఈ మధ్య ఓ దర్శకుడితో మాట్లాడానని.. ఆయనకు నచ్చిన ప్యానెల్ కు మద్దతిస్తేనే తన తదుపరి సినిమాలో క్యారెక్టర్లు రాస్తాను అన్నాడంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు ఫిలిం వర్గాల్లో చర్చనీయాంశమైంది. అక్టోబర్ 10న జరుగనున్న మా ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు తెగ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో దర్శకుడు అజయ్ భూపతి పెట్టిన ట్వీట్ సంచలనంగా మారింది. వారికి అవకాశం ఇవ్వకుంటే సినిమాల్లో అవకాశాలు రాకుండా చేస్తాననడం ఏంటి అంటూ విమర్శిస్తున్నారు పలువురు సినీ జనాలు.