నా కల నెరవేరింది.. సమంత భావోద్వేగం..!

Samantha Explains About Her Recent Char Dham Yatra Experience
Samantha Explains About Her Recent Char Dham Yatra Experience
Samantha Explains About Her Recent Char Dham Yatra Experience
Samantha Explains About Her Recent Char Dham Yatra Experience

భారత దేశంలో హిమాలయాలని దర్శించటం ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు హిందువులు. ఎంతో మంది తమ జీవితంలో ఒకసారైనా హిమాలయాలని సందర్శించిలని అనుకుంటారు. మన పురాణాల్లోను హిమాలయాల ప్రాశస్త్యం, ప్రాముఖ్యత, గొప్పదనం గురించి ఎంతో చెప్పారు. సాక్షాత్తు దేవుళ్ళు కొలువై ఉండే ప్రదేశంగా నమ్మే ఆ ప్రాంత రహస్యాలు, అద్భుతాలు ఇప్పటివరకు మానవాళి ఛేదించలేదు. ఈ క్రమంలో హిమాలయ అద్భుతాన్ని దర్శించుకున్న సమంత తాజాగా తన అనుభవాలని, అనుభూతులని పంచుకుంది. తన ప్రాణ స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి ఛార్ ధామ్ యాత్ర చేశానని.. ఎంతో అద్భుత రీతిలో తన పర్యటన ముగిసిందని.. తన యాత్ర విశేషాలని సోషల్ మీడియా వేదికలో ఫ్యాన్స్ తో పంచుకుంది సమంత.

ఛార్ ధామ్ యాత్ర ముగించుకున్న సమంత మాట్లాడుతూ.. ‘ ఈ భూమి మీద స్వర్గధామమైన ప్రదేశం.. దేవుళ్ళు కొలువుండే హిమాయలని సందర్శించాలని అనుకున్నాను. మహాభారతం చదివినప్పటి నుండి నాకు ఈ యాత్ర చేయాలనీ కోరిక. ఇక్కడి అద్భుతాలు, రహస్యాలను ప్రత్యేకంగా సందర్శించాలన్న నా కల ఇప్పటికి నెరవేరింది. దేవుడి మీదుండే నమ్మకం.. వాస్తవికత మధ్య ఉండే ఉత్కంఠత ఎప్పుడు ప్రత్యేకమైంమైంది. అదెప్పుడూ ఉత్కంఠభరితమైనదే. నా హృదయంలో ఈ హిమాలయ పర్వతాలకి మరిచిపోలేని స్తానం ఉంటుంది. నా స్నేహితురాలు శిల్పా రెడ్డితో ఈ ప్రయాణం సాగించడం.. నాకు మరింత ప్రత్యేకం ‘ అంటూ సమంత తన అనుభూతులని పంచుకుంది. ఇక యమునోత్రి పుట్టుక, ప్రవాహం, చరిత్ర గురించి వివరించింది సమంత. ఆ ప్రదేశంలోని జంతువులని కూడా సామ్ ప్రత్యేకంగా చూపెట్టింది. ఏదేమైనా విడాకుల తరువాత తన స్నేహితురాలితో కలిసి పుణ్యక్షేత్రాలని సందర్శించిన సమంత అక్కడ పూజలు హోమాలు తలపెట్టి ఎంతో సంతోషంగా ఉన్నట్టు తెలుస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)