ఉస్మానియా యూనవర్శిటీ పరీక్షలన్నీ వాయిదా

vice Chancellors appointed for Telangana universities
vice Chancellors appointed for Telangana universities

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నెల 8 నుంచి 16 వరకు జరగాల్సిన అన్నీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటించింది. ఈ మేరకు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేష్ తెలిపారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని అన్నీ విద్యాసంస్థలకు ఈ నెల 8 నుంచి 16 వరకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.