లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ చీలిక వ‌ర్గాలకు గుర్తులు కేటాయింపు

లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ చీలిక వ‌ర్గాల‌కు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించింది. ఎల్‌జెపి (రాంవిలాస్‌) వ‌ర్గానికి హెలికాప్ట‌ర్‌, కేంద్ర‌మంత్రి ప‌శుప‌తి కుమార్ రాష్ట్రీయ ఎల్‌జెపి వ‌ర్గానికి కుట్టుమిష‌న్ గుర్తులను ఈసీ కేటాయించింది.

రాంవిలాస్ మ‌ర‌ణం త‌ర్వాత రెండు వ‌ర్గాలుగా చీలిపోవ‌డంతో పార్టీ ఎవ‌రిద‌నేదానిపై వివాదం కొనసాగుతున్నది. వివాదం తేలేంత‌వ‌ర‌కు ఎన్నికల సంఘం ఇరు వర్గాలకు తాత్కాలికంగా గుర్తులు కేటాయించింది.