చిరు, ర‌జ‌నీ ల కంటే అల్లు అర్జున్ 10 రెట్లు గొప్ప‌వాడు.. ఆర్జీవీ ట్వీట్

'Allu Arjun Is 10 Times Bigger Than Rajinikanth & Chiranjeevi' RGV Goes On A Rant

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. సినీ పరిశ్రమలో అయినా, బయటి విషయాలు అయినా ఎలాంటి వాటిపైన అయినా ట్వీట్స్ చేస్తూ ఉంటారు. ఆయన ట్వీట్ చేస్తే ప్రతి వార్త వైరల్ అవ్వాల్సిందే. ఇటీవల సోషల్ మీడియాలో మరింత యాక్టీవ్ గా ఉన్నారు ఆర్జీవీ. రోజూ ఏదో ఒక విషయంపై ట్వీట్స్ వేస్తూనే ఉన్నారు. ఇటీవల అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో తన నట విశ్వరూపం చూపించారు. అన్ని సినీ పరిశ్రమల నుంచి దేశం నలుమూలల నుంచి బన్నీని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చాలా మంది సెలబ్రిటీలు కూడా బన్నీని పొగుడుతూ ట్వీట్స్ చేశారు. ఆర్జీవీ కూడా తనదైన స్టైల్ లో ‘పుష్ప’ సినిమాపై అల్లుఅర్జున్ ని పొగుడుతూ గతంలోనే ట్వీట్ చేశాడు. తాజాగా మరోసారి అల్లు అర్జున్ ని ఉద్దేశించి ఇండైరెక్ట్ గా ట్వీట్ చేశాడు.


“కఠినమైనా కానీ కాదనలేని వాస్తవం అల్లు కొత్త మెగా” అని ట్వీట్ చేశాడు ఆర్జీవీ. దీనికి అర్ధం కొంతమందికి ఇది కఠినంగా అనిపించినా అల్లు అర్జున్ కొత్త మెగాస్టార్ అంటూ తనదైన స్టైల్ లో ట్వీట్ చేశాడు.అల్లు అర్జున్ మరియు చిరంజీవి మధ్య సంబంధాన్ని ప్రస్తావిస్తూ, మెగా కుటుంబంలో పుష్ప మాత్రమే “మెగా” అని ఆర్జీవీ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. మెగా బ్లడ్ ట్రీతో నేరుగా కనెక్ట్ కానప్పటికీ, మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ ఒక్కడే మెగా అని, త్వరలో ఒమేగా అవుతాడని ట్వీట్ చేశాడు. మ‌రో ట్వీట్ లో “మెగా ఫ్యామిలీకి చెందిన కుటుంబ సభ్యులందరికీ నా స్నేహపూర్వక సలహా.. మీరెవ‌రు కూడా అల్లు అర్జున్ పుష్ప‌ పాన్-ఇండియా స్థాయిలో సంచ‌ల‌న విజయాన్ని పొందాలని కూడా ప్రయత్నించవద్దు. అల్లు వార‌బ్బాయి అల్లు అర్జున్ ఏకంగా మెగా అనే మారుపేరును అల్లుగా మార్చాడు. భవిష్యత్తులో మెగా అనే పేరు అల్లు కంటే తక్కువగా.. అల్లు అనే పేరు మెగా కంటే పైన ఉంటుంది. అని పోస్ట్ చేశారు.

అంత‌టితో ఆగ‌కుండా అల్లు అర్జున్ యొక్క పాన్-ఇండియా స్టార్‌డమ్‌ను.. చిరంజీవి మరియు రజనీకాంత్ వంటి స్టార్ల‌తో పోల్చుతూ ..అత‌ను వారి కంటే 10 రెట్లు గొప్ప‌వాడ‌ని చెప్పారు. “నిస్సందేహంగా అల్లు అర్జున్ ఆధునిక రజనీకాంతే. ఎందుకంటే అతని ఆత్మ‌ విశ్వాసం, స్వ‌భావం, ఇత‌రుల ప‌ట్ల మెలిగే వైఖ‌రి… సింపుల్‌గా చెప్పాలంటే, అతను రజనీకాంత్ కంటే ప‌ది రెట్లు గొప్ప‌వాడు. చిరంజీవి కుటుంబంలోని ఏ ఇత‌ర హీరోతోనూ అత‌న్ని పోల్చ‌కూడ‌దు. అతని తండ్రి అల్లు అరవింద్ అతడిని చూసి గర్వపడాలి అని ట్వీట్లు చేశారు.

అయితే ఆసక్తికర విషయం ఏమిటంటే, ఆ వెంటనే ఆ ట్వీట్‌లన్నింటినీ ఆర్జీవీ తొలగించాడు. అయితే, కొన్ని గంటల తర్వాత, “కఠినమైన కానీ కాదనలేని వాస్తవం అల్లు కొత్త మెగా” అని ట్వీట్ చేశాడు.
RGV ట్వీట్లు చేసిన వెంటనే, ది చిరంజీవి, పవన్ కళ్యాణ్ మరియు రామ్ చరణ్ అభిమానులు చాలా మం అతనిని ట్రోల్ చేయడం ప్రారంభించారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఆయన చెప్పిన మాటల్లో నిజ‌ముంది అంటూ స‌పోర్ట్ చేస్తున్నారు.

ఇప్పటికే సినిమా టికెట్ రేట్లపై రోజుకో ట్వీట్, గంటకో కామెంట్ పెట్టి ఇండస్ట్రీలో మంటలు రేపాడు ఆర్జీవీ. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ ఎవరనేదానిపై తనదైన స్టైల్లో వర్మ తీర్పు ఇచ్చారు. వర్మ చేసిన తాజా ట్వీట్ పై ఇండస్ట్రీ పెద్దలు ఎలా స్పందిస్తారనేది చూడాలి.