అల్లు అర్జున్ ఒక్కడే రియల్ మెగాస్టార్.. మొత్తం చిరంజీవి ఫ్యామిలీ పరువు పోయిందిగా..!

Why Allu Arjun Not Attended Megastar Chiranjeevi Birthday Party
Why Allu Arjun Not Attended Megastar Chiranjeevi Birthday Party
Allu Arjun Is The Only Present Megastar: RGV
Allu Arjun Is The Only Present Megastar: RGV

చిరు బర్త్ డే, రాఖి పౌర్ణమి రెండు పండగలు ఒకేసారి రావటంతో మెగా ఫ్యామిలీ అంత ఒకేచోట చేరి మెగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. నిన్న, మొన్న సోషల్ మీడియాని ఈ మెగా సెలబ్రేషన్సే డామినేట్ చేశాయి. ముఖ్యంగా మెగాస్టార్ ఇంట్లో పవన్ కళ్యాణ్ స్పెషల్ ఎంట్రీ పార్టీకే హైలైట్ గా నిలిచింది. మెగా ఆడపడుచులతో పాటు రెండు తరాల హీరోలు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ అంతా కలిసి తెగ సందడి చేశారు. ఇక రాంచరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణో తేజ్, వరుణ్ తేజ్ ఇలా అందరు మెగా హీరోలు సందడి చేయగా అల్లు ఫ్యామిలీ నుండి అల్లు అర్జున్ మాత్రం కనిపించకపోవటం చర్చనీయాంశం అయింది.

మెగాస్టార్ ఇంట్లో అంతపెద్ద ఈవెంట్ కి అల్లు అర్జున్ రాకపోవటం ఏంటి, అంత ఓకే నేనా అంటూ సోషల్ మీడియాలో ఎన్నో డౌట్స్. ఒకవేళ బన్నీ షూటింగ్ లో బిజీగా ఉంటే కనీసం భార్య స్నేహ అయినా హాజరవ్వాలిగా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. ఇంతలో దొరికిందే ఛాన్స్ గా సీన్ లోకి ఎంటర్ అయ్యాడు రామ్ గోపాల్ వర్మ. మెగా హీరోలందరి పరువు తీస్తూ బన్నీనే రియల్ మెగాస్టార్ అని స్టేట్మెంట్ ఇచ్చేసాడు వర్మ. తనదైన శైలిలో ట్వీట్ వదిలిన వర్మ.. అల్లు అర్జున్‌ని పొగుడుతూ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లతో సహా  మెగా హీరోల గాలి తీసేసాడు.

Allu Arjun Is The Only Present Megastar: RGV
Allu Arjun Is The Only Present Megastar: RGV

చిరంజీవి అండదండ కోరుకుంటున్న హీరోలుగా మెగా హీరోలని తీసిపడేశాడు వర్మ. అయితే కమెడియన్ అల్లు రామలింగయ్య ఫ్యామిలీ నుండి వచ్చిన అల్లు అర్జున్ మెగా అండ కోరుకోవటం లేదని, అతనొక సెల్ఫ్ మేడ్ స్టార్ అని వర్మ ట్వీట్ చేశాడు. మెగా వారసులందరితో పోల్చితే ఒక్క అల్లు అర్జున్ మాత్రమే రియల్ మెగా సక్సెస్ అందుకున్నారని వర్మ పేర్కొన్నారు. మెగా వేడుకలకు అటెండ్ కాకపోవడం అనేది అల్లు అర్జున్ తెలివితేటలకు నిదర్శనం అని.. తానూ మెగా హీరోల్లా డిపెండ్ అయ్యే హీరోని కాదని అందరికి తెలిసేలా కావాలనే బన్నీ మెగా పార్టీకి డుమ్మా కొట్టాడని వర్మ కామెంట్స్ చేశాడు. దీంతో ఆయన చేసిన ఈ ట్వీట్లపై ఆన్ లైన్‌లో రచ్చ మొదలైంది. దీన్నిబట్టి చూస్తే..మెగా ఫ్యామిలీని విమర్శించడానికి ఏ చిన్న అవకాశాన్ని వర్మ వదులుకోడని తెలుస్తుంది.