నువ్వు ఇక్కడ రావాల్సిందే లేకపోతే.. బన్నీ బాలీవుడ్ అభిమాని వీడియో చూస్తే పూనకాలే..!

allu arjun north india fan requesting to release pushpa movie in bollywood
allu arjun north india fan requesting to release pushpa movie in bollywood
allu arjun north india fan requesting to release pushpa movie in bollywood
allu arjun north india fan requesting to release pushpa movie in bollywood

స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. సౌత్ లోని అన్ని భాషల్లో క్రేజున్న తెలుగు హీరో బన్నీ. మలయాళంలో అయితే అక్కడి స్టార్ హీరోలతో పోటీగా బన్నీ సినిమాలు ఆడుతుంటాయి. అయితే గత కొద్దిరోజులుగా బాలీవుడ్ లోను బన్నీ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఓటిటి పుణ్యమాని నార్త్ లో బన్నీకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక హిందీలో డబ్బింగ్ చేసిన బన్నీ చిత్రాలు యూ ట్యూబ్ లో రికార్డులని తిరగరాస్తుంటాయి. సౌత్ లో ఏ హీరో సినిమాలకు రాని వ్యూస్ బన్నీ చిత్రాలకి వస్తుంటాయి. బాలీవుడ్ మాస్ క్రౌడ్ లో బన్నీకి ఫ్యాన్ బేస్ పెరుగుతుండటంతో తొలిసారి పుష్ప మూవీని పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కిస్తున్నారు.


ఇక నిజానికి డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ లు ఇప్పటివరకు బాలీవుడ్ లో డైరెక్ట్ మూవీ చేయకపోయినా.. పుష్పలో విలన్ పాత్ర చేస్తున్న మలయాళం విలక్షణ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ కి ఆల్ ఇండియా రేంజిలో మార్కెట్ ఉంది. దాంతో ఈ పుష్ప మూవీని ఎట్టి పరిస్థితుల్లో హిందీలో రిలీజ్ చేయాలనీ.. ఈ మూవీ హిందీలో విడుదలైతే బాలీవుడ్ లో బన్నీ స్టార్ హీరో అవుతాడని.. నార్త్ ఇండియా నుండి బన్నీ ఫ్యాన్ ఒకరు మొర పెట్టుకున్నాడు. ఎక్కడో నార్త్ లో ఉండే ఈ అల్లు అర్జున్ అభిమాని మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నేను అల్లు అర్జున్ ప్రతి సినిమాని తెలుగులో చూస్తాను. హిందీలో డబ్ అయినాక కూడా చూస్తాను. ఇక్కడ నార్త్ లో లక్షల్లో బన్నీ ఫ్యాన్స్ ఉంటారు. అందుకే ఈ సారి కచ్చితంగా పుష్ప మూవీని బాలీవుడ్ లో డైరెక్ట్ గా రిలీజ్ చెయ్యాలని.. మా కోసం ఈ పని చేయండంటూ పుష్ప మేకర్స్ ని పదే పదే బ్రతిమిలాడటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. బన్నీకి ఈ రేంజిలో నార్త్ ఫ్యాన్స్ ఉన్నారా అంటూ ఇతర తెలుగు హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.