అల్లు అయాన్ టాలీవుడ్ ఎంట్రీ.. సమంత కొడుకు పాత్రలో..?

 

Allu Arjun Son Allu Ayan Tollywood Entry
Allu Arjun Son Allu Ayan Tollywood Entry

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

స్టార్ ఫ్యామిలీస్ నుండి హీరోలు టాలీవుడ్‌లో రాణిస్తుండ‌గా, ఇప్పుడు వారి పిల్ల‌లు కూడా సిల్వ‌ర్ స్క్రీన్‌పై సంద‌డి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు కుటుంబం నుండి మూడవ తరం సినీ ఎంట్రీ ఇవ్వనుంది. అది మరెవరూ కాదు. అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్. క్రియేటీవ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో ఈ ఎంట్రీ ఉండనుందని వార్తలొస్తున్నాయి. గుణశేకర్ దర్శకత్వంలో రుద్రమదేవి మూవీలో బన్నీ చేసిన గోన గంగారెడ్డి పాత్ర తన కెరీర్ లోనే టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఈ మూవీతో బన్నీకి గుణశేఖర్ మధ్యలో మంచిహ్ బాండింగ్ ఏర్పడిందట. దీంతో గుణశేఖర్ ద్వారా తన కొడుకు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే బెటర్ అని బన్నీ కూడా అనుకుంటున్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం దుష్యంతుడు- శకుంతల ప్రేమకథ ఆధారంగా శాకుంత‌లం అనే పీరియాడిక‌ల్ చిత్రం చేస్తున్నారు గుణశేఖర్. దుశ్యంతుడి పాత్రలో మలయాళం నటుడు దేవ్ మోహన్ నటిస్తుండగా.. సమంతని శకుంతల పాత్రకి ఎంపిక చేసుకున్నాడు గుణశేఖర్. శాకుంతలం కొడుకు భరత్‌ పాత్రతో అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ ని వెండితెర‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నాడ‌ట‌ గుణశేఖర్. ఇప్పటికే అల్లు అయాన్ కి ‘అలా వైకుంఠపురములో’ మూవీ ప్రమోషినల్ సాంగ్  చేసిన అనుభవముంది. ఇక ఇది కుదరకపోతే జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్‌ రామ్‌ లేదా చిన్నబ్బాయి భార్గ‌వ్ రామ్ పేర్లు కూడా గుణశేఖర్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. దిల్ రాజు సమర్పణలో, గుణ టీమ్ వర్క్ బ్యానర్ పై గుణశేఖర్ కూతురు నీలిమ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.