మా ఎన్నికలకు అల్లు అర్జున్ రాకపోవడానికి కారణమిదే..

మా ఎన్నికల ప్రచారంలో, ఎన్నికల ఫలితాల్లో జరిగిన రచ్చ మనందరికీ తెలిసిందే. అయితే… ఈ ఎన్నికల్లో చాలామంది సినీ సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మెగా హీరోలు చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ తో పాటు.. రామ్ చరణ్ కూడా ఓటు వేశాడు.

అయితే.. మెగా హీరోల్లో ఓ మెయిన్ హీరో మాత్రం మా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదు. మెగా హీరోలంతా వచ్చినా.. అల్లు అర్జున్ మాత్రం ఎందుకు రాలేదని చాలామంది మాట్లాడుకున్నారు. అయితే.. అల్లు అర్జున్ మా ఎన్నికల్లో ఎందుకు ఓటేయ్యలేదో తెలిసిపోయింది.


పుష్ప సినిమా పనుల్లో బిజీబిజీగా ఉన్న అల్లు అర్జున్, సుకుమార్ టీమ్.. షూటింగ్ కి చిన్న గ్యాప్ ఇచ్చాడట. ఈ గ్యాప్ లో కాస్త రిలాక్స్ అయేందుకు అల్లు అర్జున్ మాల్దీవులకు వెళ్లాడు. అందుకే మా ఎన్నికల్లో ఓటు వేయడానికి రాలేదట.

శరవేగంగా ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఇన్నిరోజులు పుష్ప షూటింగులో పాల్గొన్న బన్నీ.. దొరికిన కాస్త టైమ్ ని రిలాక్స్ అవడానికి వాడుకున్నాడంటున్నారు పలువురు. బన్నీ మాత్రమే కాదు. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కూడా ఎన్నికలకు రాలేదు. సినిమా షూటింగుల్లో బిజీగా ఉండటం వల్లే వరుణ్ తేజ్ కూడా రాలేదా.. లేక వేరే కారణాలేమైనా ఉన్నాయా అని ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.