టమాట బదులు ఇవి వాడండి

tomato
tomato

మార్కెట్లో టమాట రేటు చెప్తే మాట పడిపోయే పరిస్థితి ఉంది. కేజీ టమాట రూ.120 నుంచి 130 వరకు ఉంది. తినాలని ఉన్నా కొనాలంటే మాత్రం కన్నీళ్లు వస్తున్నాయి. వంటల్లో, కూరల్లో తప్పనిసరి అయిన టమాట లేని లోటు తీర్చడం చాలా కష్టం. అయినప్పటికీ కూరల్లో టమాటకు ప్రత్యామ్నయాలు వెతుకుతున్నారు చాలామంది. అవేంటో ఓ లుక్కేయండి మరి..


వంటల్లో పులుపు రావడం కోసం కచ్చితంగా టమాటలు వేయాల్సిందే. లేదంటే కూరకు రుచి రాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో టమాట కొనలేక చాలామంది వేరే మార్గాలు ఆలోచిస్తున్నారు. వంటల్లో పులుపుదనం కోసం టమాటలకి బదులు కొద్దిగా చింతపండు, లేదంటే చింతపండు రసం వేస్తే వంటకు పులుపు వస్తుంది. కూరకు చిక్కదనం కూడా పెరుగుతుంది.


వంటల్లో ఉసిరి పొడి, ఆమ్‌చూర్‌ పౌడర్‌ వంటివి వేస్తే.. కూరలకు పులుపుతో పాటు.. అదనపు రుచి కూడా యాడ్ అవుతుంది. రెండింటిలో ఏదో ఒక పొడి కూర వండేటప్పుడు చిటికెడు కలపండి. టమాట లేని లోటు కాస్త తీరుతుంది.


కూర చిక్కగా రావాలంటే టమాట తప్పనిసరిగా వేయాల్సిందే. ప్రస్తుతం మార్కెట్లో టమాట రేట్లను చూస్తే మాత్రం మనసు చంపుకోక తప్పదు. అయితే.. దీనికి ప్రత్యామ్నాయంగా ఉల్లిపాయల్ని ఉపయోగించవచ్చు. ఉల్లిపాయల్ని దోరగా వేయించి పేస్ట్‌లా మిక్సీ పట్టుకొని కూరల్లో వేసుకోవచ్చు. ఎక్కువ వేస్తే కూర రుచి మారిపోతుంది. మోతాదుగా వేసుకోవాలి.


టమాటకు బదులు పచ్చి మామిడి కాయలు కూడా కూరల్లో వేసుకోవచ్చు. కాకపోతే పచ్చి మామిడి కాయలు ఏడాది పొడవునా దొరకవు. దీనికి కూడా ఓ ప్రత్యామ్నయం ఉంది. మామిడి వొరుగులు, చిపస్ ఫ్లేక్స్ వంటివి వంటల్లో వేస్తే మీ కూరకు పులుపు తోడవుతుంది.

mango

కూరల్లో గ్రేవీ కోసం చాలామంది టమాటకు బదులు బూడిద గుమ్మడికాయ గుజ్జు కూడా వేసుకోవచ్చు. ఇది కూడా టమాటలాగే తియ్యతియ్యగా, పుల్లపుల్లగా ఉంటుంది. రుచి కూడా అదిరిపోతుంది.