వ్య‌వ‌సాయ రంగంలో అద్భుత‌ ప్ర‌గ‌తి.. తెలంగాణ‌కు సెకండ్ ర్యాంక్.. మంత్రి కేటీఆర్ హ‌ర్షం

వ్య‌వ‌సాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత‌మైన ప్ర‌గ‌తి సాధించింది. భార‌త‌దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచి.. ప‌లు రాష్ట్రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కంగా నిలిచి ప్ర‌శంస‌లు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేశారు.

సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయడం, 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్ ఇవ్వ‌డంతో పాటు పంట పెట్టుబ‌డి సాయం కింద ఎక‌రానికి సంవ‌త్స‌రానికి రూ. 10 వేల చొప్పున ఇవ్వ‌డం వ‌ల్లే ఈ విజ‌యం సాధ్య‌మైందని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రం వ్య‌వ‌సాయ రంగంలో 6.59 శాతం వృద్ధి రేటును సాధించి, దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. మొద‌టి స్థానంలో త్రిపుర‌ (6.87 శాతం వృద్ధిరేటు), రెండో స్థానంలో సిక్కిం (6.59 శాతం వృద్ధి రేటు) నిలిచిన‌ట్లు నీతి అయోగ్ రిపోర్టులో చెప్పారు.

కరోనా సమయంలోనూ వృద్ధి

తెలంగాణ రాష్ట్రంలో వ్య‌వ‌సాయ రంగంలో పురోగ‌తి ప‌రిశీలిస్తే.. 2016-17లో రూ.88,979 కోట్లు, 2017-18లో రూ.1,02,044 కోట్లు, 2018-19లో రూ.1,13,223 కోట్లుగా ఉంది. కరోనా, లాక్ డౌన్ స‌మ‌యంలో(2020-21) కూడా వ్య‌వ‌సాయం, దాని అనుబంధ రంగాల నుంచి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ.. 3 శాతం నుంచి 21 శాతం వృద్ధికి(జాతీయ స్థాయిలో) పెరగడం గమనార్హం.