కన్నడ పవర్‌స్టార్ దివంగత పునీత్ రాజ్‌కుమార్‌కు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఘన నివాళి అర్పించింది.
ఈ సందర్భంగా ఆయన్ను గుర్తుచేసుకుంటూ పునీత్ సినిమాలను, పీఆర్‌కె పొడక్షన్స్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడాన్ని మేం గౌరవంగా భావిస్తున్నామని పేర్కొంది.
పునీత్ రాజ్‌కుమార్ నటించి నిర్మించిన ఐదు సినిమాలు (యువరత్న, కవలుదారి, లా, మాయా బజార్, ఫ్రెంచ్ బిరియాని) చిత్రాలను ఫిబ్రవరి1 -28 వరకు స్ట్రీమింగ్ చేస్తున్నట్లు వెల్లడించింది.
వీటిని అమెజాన్‌లో అందరూ ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పించింది. వాటితో పాటు పునీత్ నిర్మాణ సంస్థ రూపొందిస్తున్న 3 కొత్త సినిమాలు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ‘వన్ కట్ టూ కట్’, ‘ఫ్యామిలీ ప్యాక్’ కూడా తమ ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది.
with all the love and respect for power star puneeth rajkumar sir, we bring you 3 beautiful stories that will stay with you forever 💙@PRK_Productions @ashwinipuneet @PRKAudio@VamBho @nakulabhyankar @danishsait @samyuktahornad #PrakashBelawadi pic.twitter.com/FEAQwwVVch
— amazon prime video IN (@PrimeVideoIN) January 21, 2022