ఓవర్ యాక్షన్ చేస్తే.. మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం - TNews Telugu

ఓవర్ యాక్షన్ చేస్తే.. మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాంఅతిక్రమణలకు పాల్పడుతూ.. కవ్విస్తే చూస్తూ ఊకోం అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాకిస్థాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఓవర్ యాక్షన్ చేస్తే మరిన్ని సర్జికల్స్ స్ట్రైక్స్ చేస్తామని హెచ్చరించారు. పాక్ దాడులను ఏమాత్రం సహించమని.. మా సర్జికల్ స్ట్రైక్స్ నిరూపించాయి. మీరు ఇలాగే చేస్తే.. మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ తప్పవు. అదుపులో ఉండాలి అంటూ అమిత్ షా హెచ్చరించారు.


ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తీసుకున్న నిర్ణయమే ఈ సర్జికల్ స్ట్రైక్స్. ఇండియా సరిహద్దులను చెరిపే ప్రయత్నం ఎవరు చేసినా.. ఊరుకోం అని సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా సందేశమిచ్చాం. ఒకప్పుడు చర్చలు జరిగేవి. ఇప్పుడు దెబ్బకు దెబ్బ కొడుతాం అన్నారు అమిత్ షా. గోవాలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ శంకుస్థాపనలో పాల్గొన్న అమిత్ షా దేశ భద్రతకు సంబంధించి వ్యాఖ్యలు చేశారు.