కోర్టులో కేసు వేస్తా.. అక్కడే తేల్చుకుంటా.. అనసూయ సంచలన వ్యాఖ్యలు

Anchor Anasuya About Maa Elections Results Rumours
Anchor Anasuya About Maa Elections Results Rumours
Anchor Anasuya About Maa Elections Results Rumours
Anchor Anasuya About Maa Elections Results Rumours

వాదోపవాదాలు.. ఎత్తుకి పైఎత్తులు.. చిత్ర విచిత్రాలు.. బాహాబాహీళ నడుమ జరిగిన మా ఎలెక్షన్స్ లో మంచు విష్ణు ఘన విజయం సాధించాడు. ఫలితాల తరువాతైనా ‘మా’ లొల్లి చల్లబడుతుందనుకుంటే.. పరిస్థితిలు మరింత హీటెక్కాయి. మంచు వర్గం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ప్రకాశ్ ప్యానల్. అయితే కౌంటింగ్ ఆఖర్లో బ్యాలెట్ బాక్సులని కూడా ఇంటికి పట్టుకెళ్ళిపోయారని.. అక్కడే అనసూయ వంటి వారి కొందరి ఈసీ సభ్యుల రిజల్ట్స్ తారుమారు చేశారని నిన్నప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యుడు ఈటివి ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల ఫలితాల రాత్రి యాంకర్ అనసూయ అఖండ విజయం సాదించందని మీడియాలో పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. కానీ తెల్లారేసరికి అనసూయ జాతకం తిరగబడింది. ఈసీ మెంబర్ గా ఓడిపోయిందని అనసూయ రిజల్ట్ ప్రకటించారు. దీనిపై అనసూయ హాట్ కామెంట్స్ చేసింది.

ఎన్నికల్లో గెలిచినట్టు రాత్రి ప్రకటించి.. మరుసటిరోజు ఓడిపోయానని చెప్పటంలో మతలబేంటి.. అంటూ అనసూయ సంచలన ట్వీట్ పెట్టింది. దీంతో నిన్నటి ప్రకాశ్ రాజ్ మీడియా సమావేశంలో అనసూయని మీడియా వారు చుట్టిముట్టి అనేక ప్రశ్నలు సంధించారు. ఎన్నికల్లో ఏవైనా అవకతవకలు జరిగాయని మీరు అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించిన మీడియాపై చిందులేసింది ఈ జబర్దస్త్ యాంకర్. ‘నేను ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎక్కడ చెప్పలేదు. అఖండ మెజారిటీతో గెలిచానని మీరే రాశారు. కొంచం న్యూస్ రాస్తున్నప్పుడు ఆలోచించి రాయండి. న్యూస్ రాయండి కానీ క్రియేట్ చేయొద్దు అంటూనే.. నాపై తప్పుడు కథనాలు రాస్తే కోర్టులో కేసు వేస్తా.. అక్కడే తేల్చుకుంటా అంటూ అనసూయ మీడియా సమావేశం నుండి వెళ్ళిపోయింది. నా పేరు వాడి లేనిపోని కథనాలు రాస్తే కోర్టుకు వెళ్తా.. అంటూ అనసూయ తీవ్రంగా హెచ్చరించింది కూడా.