ఏడ్వలేక నవ్వుతున్నా.. మనసులో బాధను బయటపెట్టిన అనసూయ..!

Anchor Anasuya Fun With Bangarraju Director Kalyan Krishna
Anchor Anasuya Fun With Bangarraju Director Kalyan Krishna

అటు బుల్లితెర ఇటు వెండితెర రెండింటిని తన అందచందాలతో అదరగొడుతుంది యాంకర్ అనసూయా. మొన్న పుష్పలో నెగిటీవ్ షేడ్స్ ఉన్న దాక్షాయణి పాత్రలో రెచ్చిపోయి నటించి ప్రొఫెషనల్ ఆర్టిస్టు అనిపించుకుంది. అయితే సినిమా ఈవెంట్స్, టీవీ షోస్ చేస్తున్న అనసూయాకి మొదట మూవీ బ్రేక్ ఇచ్చింది డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణనే. సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో.. నాగార్జున తో స్పెషల్ సాంగ్ లో చిందేసి అందరి హార్ట్స్ బ్రేక్ చేసింది. ఆ మూవీ తరువాతే అనసూయాకి వరుస సినిమా ఆఫర్స్ రావటం మొదలయ్యాయి. అయితే కళ్యాణ్ కృష్ణ లేటెస్ట్ మూవీ బంగార్రాజులో మాత్రం అనసూయకి అవకాశం దొరకలేదు. దాంతో నొచ్చుకున్న అను బ్యూటీ బుంగమూతి పెట్టి మరీ నాగార్జునని ప్రశ్నించింది. తనని ఈ సినిమాలో ఎందుకు పెట్టుకోలేదో చెప్పాలని డైరెక్టర్ ని డిమాండ్ చేసింది. తానూ ఏడవలేక నవ్వుతు ఇక్కడ మాట్లాడుతున్నా అంటూ కొంటె కామెంట్స్ చేసింది అనసూయా. ఈ సరదా సంఘటనకి బంగార్రాజు ప్రి రిలీజ్ ఈవెంట్ వేదికవ్వగా.. అనసూయ, నాగార్జున, కళ్యాణ్ కృష్ణల మధ్య జరిగిన ఈ సంభాషణ నెట్టింట్లో వైరల్ అవుతుంది.

అనసూయ భరద్వాజ్ గురువారం నాడు బంగార్రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేశారు. బంగార్రాజుతో సంబంధం లేకున్నా.. సోగ్గాడే చిన్ని నాయనలో బుజ్జిగా నటించిన అనసూయా.. బంగార్రాజు సినిమాలో తనకు పాత్ర ఎందుకు ఇవ్వలేదు.. తనను ఎందుకు పెట్టుకోలేదని స్టేజ్ మీదే దర్శకుడిని నిలదీసింది. కారణం చెప్పాలని డైరెక్టర్ కి ఆర్డర్ వేసింది. దాంతో పక్కనే ఉన్న దర్శకుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ.. అయితే చిన్న బంగార్రాజుకు పిన్ని పాత్ర అవుతుంది.. ఏజ్ ఎక్కువగా చూపించాల్సి వస్తుందని.. అలాంటి పాత్ర చేస్తారా? అని వద్దన్నాను అంటూ కళ్యాణ్ కృష్ణ కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే తనకి ఇలా చెప్పలేదని.. వేరే బిస్కెట్ ఎదో వేశాడని అనసూయా కామెడీ చేసింది. తనకి ఆఫర్ ఎందుకు ఇవ్వలేదంటే.. నీతో బుజ్జి అని ఒక వెబ్ సిరీస్ చేస్తా అని కళ్యాణ్ కృష్ణ పెద్ద బిస్కెట్ వేశాడని ఫన్నీ కామెంట్స్ చేసింది. ఇక అంత పెద్ద బిస్కెట్ ఎవరైనా వేస్తారా? అంటూ సందడి చేస్తూ.. ఏడవ్వలేక ఇలా నవ్వుతూ మాట్లాడుతున్నాను.. ఈ సినిమాలో నన్ను ఎందుకు పెట్టుకోలేదు అని ఎప్పుడూ అడుగుతూనే ఉంటా.. నీ కలలోకి కూడా వస్తాను అంటూ డైరెక్టర్ తో ఆడుకుంది అనసూయ. ఇక సంక్రాంతి కానుకగా నేడు విడుదలైన బంగార్రాజు మంచి పాజిటీవ్ టాక్ తో రన్ అవుతుంది. పక్క సంక్రాంతి ఎంటర్టైనర్ అంటూ పబ్లిక్ టాక్ బయటికి వచ్చేసింది.