లో- దుస్తులు వేసుకోలేదా అంటూ .. నీచమైన కామెంట్స్.. యాంకర్ అనసూయ ఆగ్రహం..! - TNews Telugu

లో- దుస్తులు వేసుకోలేదా అంటూ .. నీచమైన కామెంట్స్.. యాంకర్ అనసూయ ఆగ్రహం..!Anchor Anasuya Jabardasth Reaction On Trollers Who Badly Insulted Hemangi
Anchor Anasuya Jabardasth Reaction On Trollers Who Badly Insulted Hemangi

సొసైటీలో సోషల్ మీడియాకి ఎన్ని పాజిటీవ్ అంశాలున్నా.. అన్నే నెగిటీవ్ కోణాలూ ఉన్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీలను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసే విధానం అత్యంత హేయమైనది. నెటిజన్స్ ఎవరిపై ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో.. ఏ సెలబ్రెటీని ఎలా ట్రోల్ చేస్తారో చెప్పటం కష్టమైన పని. రీసెంట్ గా కిచెన్ లో చపాతీలు చేస్తూ ఉండే వీడియోని పోస్ట్ చేసిన మరాఠీ నటి హేమంగీ కవికి సోషల్ మీడియాలో అవమానకర అనుభవం ఎదురైంది. హేమంగీ డ్రెస్సింగ్ పై ఆకతాయిలు అసభ్యకర ట్రోలింగ్ చేసారు. ఆ వీడియోలో చపాతీ చేసే దాన్ని వదిలిపెట్టి.. ‘ఏంటి లో-దుస్తులు ధరించలేదా..?, లోపల నీ బాడీ స్పష్టంగా కనిపిస్తోంది” అంటూ నీచమైన కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేశారు.

దీంతో వారికి స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చింది హేమంగీ కవి. ‘అందరికి ఉన్నట్టే నాకు ఉన్నాయి. పని చేస్తున్నప్పుడు శరీరంలోని కాళ్ళు, చేతులు కదిలినట్టే అవి కూడా కదులుతాయి. ఇక నా ఇంట్లో ఉన్నప్పుడు ఏం వేసుకోవాలో, ఏం వేసుకోకూడదో అన్నది నా ఇష్టం అంటూ ట్రోలింగ్ చేసే వారికి గట్టిగా పంచ్ ఇచ్చారు హేమంగీ కవి. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ కామెంట్స్ పై మహిళలందరూ హేమంగీ కవికి మద్దత్తుగా నిలుస్తుంటే.. లేటెస్ట్ గా ఈ అంశంపై యాంకర్ అనసూయ స్పదించినట్టు తెలుస్తుంది. తనదైన శైలిలో ఆకతాయిలకు జబర్దస్త్ కౌంటర్ ఇచ్చింది.      ‘ నీ ధైర్యానికి హ్యాట్సాఫ్. ఎంతో డేర్ గా మాట్లాడారు. అద్దిరిపోయే జవాబిచ్చావ్’ అన్న మీనింగ్ వచ్చేలా మరాఠి నటి హేమంగీ కవికి మద్దత్తుగా నిలిచింది అనసూయ.

అయితే హేమాంగికి దేశం నలువైపులా నుండి మద్దత్తు వస్తుంది. ఎక్కడ ఎప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలో            మా ఛాయిస్ అంటూ మహిళలందరూ హేమంగికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. నిన్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా హేమంగికి సపోర్టుగా నిలవగా నేడు అనసూయ మద్దత్తుగా నిలిచింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా ఈ చర్చ నడుస్తుంది.