రిపబ్లిక్ డే వివాదం.. యాంకర్ అనసూయకి చివాట్లు..!

Anchor Anasuya Republic Day Wishes Getting Trolled By Netizens
Anchor Anasuya Republic Day Wishes Getting Trolled By Netizens

యాంకర్ అనసూయ.. సినిమాలు, టీవీషోస్, ఈవెంట్స్ చేస్తూ అటు బుల్లితెర, ఇటు వెండితెరలలో రాణిస్తూ వస్తుంది. లేటెస్ట్ గా పుష్ప బ్లాక్ బస్టర్ తో కెరీర్ బెస్ట్ ఫార్మ్ లో ఉన్న అనసూయ సోషల్ మీడియాలోను ట్రెండింగ్ లో ఉంటుంది. నిత్యం ఏదొక ఇష్యుతో నెటిజన్స్ తో కాంట్రవర్సీలు కొని తెచ్చుకుంటుంది. అయితే తాజాగా నిన్న జరిగిన రిపబ్లక్ డే సందర్భంగా మరో కొత్త వివాదంలో చిక్కుకుంది యాంకర్ అనసూయ. సాధారణంగా జాతీయగీతాన్ని, జాతీయ గేయాన్ని ఎంతో గౌరవిస్తారు భారతీయులు. వాటిని పాడే సందర్భంలో గౌరవసూచికంగా కొన్ని పద్ధతులని అవలంభిస్తారు. జాతీయ గీతాన్ని పాడే సమయంలో కచ్చితంగా లేచి నిలబడి ఆలపిస్తారు. థియేటర్లో సైతం ఇలాంటి దృశ్యాలని చూస్తుంటాం. కానీ రిపబ్లిక్ డే సందర్భంగా అనసూయ ఇలాంటి పద్ధతులేవి పాటించలేదంటూ నెటిజన్స్ చేతిలో చివాట్లు తినింది.

అనసూయ అందరికీ రిపబ్లిక్ డే విషెస్ చెబుతూ ఎంతో అందంగా పాట పాడింది. వందేమాతరం అంటూ ఆలపించింది. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పింది. ఈ మేరకు అనసూయ షేర్ చేసిన వీడియోపై నెటిజన్స్ మండిపడుతున్నారు. జాతీయ గీతాన్ని పాడేటప్పుడు అనసూయ లేచి నిల్చోలేదని నెటిజన్స్ నుండి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. దేశభక్తి మనసులో ఉంటే సరిపోదు.. తన చేతల్లో కూడా చూపెట్టాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ అనసూయని ట్రోల్ చేస్తున్నారు.ఇక ఇదే కాకుండా ఆ వీడియోలో అనసూయ వేసుకున్న డ్రెస్ పై కూడా విమర్శలు ఎదురయ్యాయి. తాను వేసుకున్న టీషర్ట్ పై గాంధీ బొమ్మ ఉంది. ఈ విషయంలోనూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. గాంధీ బొమ్మ ఉన్న టీ షర్ట్ ఎందుకు వేశావ్.. రిపబ్లిక్ డే అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. అది రాసింది అంబేద్కర్. గాంధీ కాదు.     ఆ టీషర్ట్ మీద అంబేద్కర్ బొమ్మ ఉండాలి అంటూ ఇలా నెటిజన్లు అనసూయను టార్గెట్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

అయితే ఎప్పటిలానే విరుచుకుపడే నెటిజన్లకు అనసూయ జ్ఞానబోధ చేసింది. నేషనల్ ఆంథమ్ పాడేటప్పుడు గౌరవ సూచికంగా లేచి నిల్చుంటాం దేశ భక్తిని చాటుకుంటాం. జనగణమన అనేది నేషనల్ ఆంథమ్.. వందేమాతరం అనేది నేషనల్ సాంగ్.. బంకిం చంద్ర ఛటర్జీ రాశారు.. కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటిసారిగా పాడారు. సారే జహాసే అచ్చా అనేది నా దేశం లోగో.. ఇవన్నీ దేశభక్తి గీతాలు.. నేను ఇండియన్‌ని.. ఐ లవ్.. రెస్పెక్ట్.. నా గుర్తింపుకు వ్యాల్యూ ఇచ్చుకుంటాను.. అంతే.. జై హింద్ అని అనసూయ కామెంట్ పెట్టేసింది. ఇక టీ షర్ట్ పై గాంధీ బొమ్మ ధరించటంపై వస్తున్న ట్రోలింగ్ పై కూడా మాస్ స్టైల్ లో స్పందించింది యాంకర్ అనసూయ. ‘అరే ఏందిరా భై మీ లొల్లి.. కొంచెం బుర్ర అద్దెకు తెచ్చుకోనన్నా మాట్లాడుర్రి.. హ్యాపీ రిపబ్లిక్ డే మరి’ అని కౌంటర్లు వేసింది అనసూయ.