సమంత విడాకులపై కారుకూతలు.. గట్టిగా గడ్డి పెట్టిన యాంకర్ అషురెడ్డి..!

anchor ashu reddy support to samantha
anchor ashu reddy support to samantha
anchor ashu reddy support to samantha
anchor ashu reddy support to samantha

తెలుగు రాష్ట్రాల్లో గడిచిన కొద్దికాలంగా ట్రెండ్ అవుతున్న అంశం సమంత, నాగచైతన్యల విడాకులు. వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారో, కారణం ఎవరో, గొడవ ఏంటో ఇప్పటివరకు ఎవరికీ తెలియకపోయినా ఇష్టమొచ్చినట్టు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా సమంత క్యారెక్టర్ పై భారీ విమర్శలు చేస్తున్నారు. స్వయంగా సామ్ వచ్చి వదంతులని ఖండించినా ట్రోలింగ్ ఆగటం లేదు. ఈ రోజు శాకుంతలం మూవీ నిర్మత, డైరెక్టర్ గుణశేఖర్ భార్య నీలిమ గుణ కూడా స్పందిస్తూ.. సమంత పిల్లల కోసం సినిమాలని వదిలేయడానికి రెడీ అయిపోయింది. ఆమెపై విమర్శలు ఆపండి అని చెప్పింది. అయినా ట్రోలింగ్ ఆగడం లేదు. తాజాగా సమంతపై నెగిటివ్ కామెంట్స్ చేసిన ఒక నెటిజన్ కి కౌంటర్ ఇచ్చింది జూనియర్ సమంత అషురెడ్డి. ఎదుటివారి గురించి పూర్తిగా తెలియకుండా వాగొద్దు అని సదరు నెటిజన్ కి గడ్డిపెట్టి సూపర్ అనిపించుకుంది అషురెడ్డి.

టిక్ టాక్ వీడియోస్ తో ఫెమ్ తెచ్చుకొని.. బుల్లితెరలో జూనియర్ సమంతలా.. ఎన్నో టీవీ షోస్, ఈవెంట్స్ చేస్తూ క్రేజ్ దక్కించుకుంది అషురెడ్డి. తనదైన బోల్డ్ అందాలతో సోషల్ మీడియూలో అందరిని అలరించే అషు.. తాజాగా తనలోని బోల్డ్ యాంగిల్ ని కూడా బయటికితీసింది. ‘స్టాప్‌ అండే స్టేర్‌.. బికాస్‌ అయామ్‌ రేర్‌’ అంటూ పోస్ట్‌ చేసిన ఆ ఫొటోకు అభిమానులు అందరూ లైక్‌లు కొడుతూ కామెంట్లు పెడుతూ స్పందించారు. అందులో ఒక అభిమాని ‘అషూ మీరు సమంతలాగే ఉన్నారు.. మ్యారేజ్‌ విషయంలో మాత్రం సమంతలాగా చేయొద్దు’ అని కారుకూతలు కూశాడు. దీంతో అతనికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది అషురెడ్డి. ‘ కథలో మీకు మరో కోణం గురించి తెలియదు. అది తెలుసుకోకుండా ఎదుటివారి గురించి, వారి జీవితాల గురించి మాట్లాడొద్దు’ అని కామెంట్స్ చేసింది అషు రెడ్డి. అయితే విడాకుల అనౌన్స్ మెంట్ తరువాత సమంతపై మొదట్లో విమర్శలొచ్చినా.. సమయం గడుస్తున్నా కొద్దీ సామ్ కి మద్దత్తు పెరుగుతుంది. ఇండస్ట్రీ లోని అందరు ఒక్కొక్కరుగా సమంతపై వస్తున్న విమర్శలని ఖండిస్తున్నా సమయంలో.. ఇకనైనా సమంతపై ట్రోలింగ్ ఆగాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.