ఆస్పత్రిలో చేరిన అన్నా హజారే

Anna-Hazare

ప్రముఖ సామాజిక కార్యకర్త, అవినీతి వ్యతిరేక ఉద్యమ నేత అన్నా హజారే ఆస్పత్రిలో చేరారు. ఛాతిలో నొప్పి రావడంతో పుణేలోని రూబీ  ఆస్పత్రిలో చేరారు.

ప్రస్తుత అన్నా హజారే ఆరోగ్యం నిలకడగానే ఉందని, డాక్టర్ల పరిశీలనలో ఉంచినట్టు రూబీ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అవధత్ బోడంవాద్ చెప్పారు.

‘‘ఛాతీ నొప్పి, నీరసం కారణంగా హజారే ఆస్పత్రిలో చేరారు. ఆయనకు యాంజియోగ్రఫీ నిర్వహించాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.’’ అని డాక్టర్ అవధత్ వివరించారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆరా..

కాగా హజారే ఆరోగ్య పరిస్థితిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఉద్ధవ్‌ హెచ్‌ ఎన్‌ రిలయన్స్‌ ఆస్పత్రిలో ఫిజియోథెరపీ చికిత్స తీసుకుంటున్నారు.