ఇంటర్నెట్ లో ఆ హీరోయిన్ నగ్న వీడియో.. వెలుగులోకొచ్చిన రాజ్ కుంద్రా మరో దారుణం..!

Another Actress Files a Complaint Against Raj Kundra
Another Actress Files a Complaint Against Raj Kundra
Another Actress Files a Complaint Against Raj Kundra
Another Actress Files a Complaint Against Raj Kundra

శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నో గ్రఫీ కేసు యావత్ దేశాన్ని ఒక కుదుపు కుదిపేసింది. అప్పటివరకు సెలబ్రెటీ కపుల్స్ గా స్టార్ స్టేటస్ అనుభవించిన ఈ జంటపై రాజ్ కుంద్రా అరెస్ట్ నుండి మీడియాల్లో వరుస కథనాలు. నీలిచిత్రాలు, అడల్ట్ కంటెంట్, గోల్డ్ స్కామ్ ఇలా రాజ్ కుంద్రా కి సంబదించిన చీకటి సామ్రాజ్యాలన్నీ ఒక్కొక్కటిగా బయటికొస్తున్న తరుణంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అశ్లీల వీడియోల కేసులో ఇప్పటికే పీకల్లోతు మునిగిన రాజ్ కుంద్రా మరింత చిక్కుల్లో పడ్డాడు. తాజాగా మరో నటి కుంద్రాపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ పోలీస్ కేసు పెట్టడం సంచలనమైంది.

తన అనుమతి లేకుండా న్యూడ్ వీడియోలని తీసి ఇంటర్నెట్ లో పెట్టాడంటూ పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఇప్పటికే ఎందరో నటీమణులు రాజ్ కుంద్రాపై ఆరోపణలు చేయగా తాజాగా మరో నటి కూడా తన వీడియోల్ని తన అనుమతి లేకుండా రాజ్ కుంద్రా హాట్ షాట్స్ యాప్ లో విడుదల చేశారని ఆరోపిస్తూ ఈ నటి పోలీస్ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ముంబై పోలీసుల ముందు ఆమె మరిన్ని సంచలనం నిజాలు బయటపెట్టినట్టు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో రాజ్ కుంద్రా వ్యక్తిత్వంపై కూడా ఆరోపణలు చేసింది. రాజ్ కుంద్రా మంచోడు కాదని.. తన ‘ప్రైవేటు పార్ట్స్’ను వీడియోలో చూపించకూడనని ఒప్పందం ముందే చేసుకుని రాజ్ కుంద్రా మూవీలో నటించానని.. అలాంటిది తన షరుతుని తుంగలో తొక్కి తనకి చెప్పాపెట్టకుండా ఆ వీడియోలని ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేసాడని ఆరోపించింది. ఏ విధమైన మార్పులు చేయకుండా పూర్తి వీడియోను హాట్ షాట్ యాప్ లో విడుదల చేశారని.. తన స్నేహితుడి ద్వారా విషయం తెలుసుకుని షాక్ అయ్యానని తెలిపింది. ఇక ఇప్పటికే అనేక రకాల అక్రమాలతో జైలు శిక్ష అనుభవిస్తున్న రాజ్ కుంద్రా పై మరో నటి ఫిర్యాదుతో కేసు మరింత మలుపు తిరిగే అవకాశాలున్నాయి. మరి మున్ముందు ఈ కేసు ఎటువైపు వెళుతుందనేది ఆసక్తి గా మారింది.