మరో అశ్లీల కంటెంట్ ఉల్లు యాప్ గుట్టురట్టు..నిర్మాతపై కేసు పెట్టిన పోలీసులు

బాలీవుడ్ లో అశ్లీల కంటెంట్ అప్ లోడ్ చేస్తున్న మరో యాప్ ను పోలీసులు గుర్తించారు. ఉల్లు పేరుతో ఈ యాప్ ను రన్ చేస్తున్నారు. ఇందులో చాలా మంది మహిళలను బలవంత పెట్టి అశ్లీల కంటెంట్ ను చిత్రీకరిస్తున్నారంట. ముంబైలోని అంధేరీలో ఉన్న ఆఫీస్ లో ఓ మహిళపై అత్యాచారం కూడా జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. పక్కా ఆధారాలు ఉండటంతో ఈ యాప్ రన్ చేస్తున్న నిర్మాత విభూ అగర్వాల్, కంపెనీ హెడ్ అంజలీ రైనా లపై కేసు నమోదు చేశారు.

ఉల్లు యాప్ లోనూ అశ్లీల కంటెంట్

బాలీవుడ్ లో రాజ్ కుంద్రా అశ్లీల కంటెంట్ యాప్ వ్యవహారం మరకవకముందే ఉల్లు యాప్ సంగతి బయటపడింది. ఈ యాప్ లోనూ విపరీతమైన అశ్లీల కంటెంట్ ను అప్ లోడ్ చేస్తున్నారు. ఈ యాప్ కు సంబంధించిన చాలా వీడియోలు పోర్న్ సైట్లలోనూ ఉన్నాయి. అసభ్యంగా, అశ్లీల కంటెంట్ తో వెబ్ సీరిస్ లు, వీడియోలు రూపొందిస్తున్నారంటూ విభూ అగర్వాల్, అంజలీ రైనాలపై ఐపీసీ 354 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

2019 లో ఉల్లు యాప్ ప్రారంభం

విభూ అగర్వాల్ 2013 లో బాత్ బాన్ గయూని సినిమా తీశారు. ఆ తర్వాత వెబ్ సిరీస్ లు చేశారు. 2019 లో ఉల్లు పేరుతో యాప్ ప్రారంభించారు. ఇందులో పూర్తిగా అసభ్యకరమైన కంటెంట్ ను నింపేస్తున్నారు. హిందీ, ఇంగ్లీష్‌, భోజ్‌పురి, తెలుగు,మరాఠీ సహా పలు భాషల్లో వీడియోలు చేస్తున్నారు. వీడియోల పేరుతో ఎంతోమంది మహిళను వేధింపులకు గురిచేస్తున్నట్లు విభూ అగర్వాల్ పై ఆరోపణలు ఉన్నాయి.