ఎంపీ రఘురామ కేసులో మరో ట్విస్ట్.. సుప్రీం సంచలన ఆదేశాలు

ఏపీ నర్సాపురం ఎంపీ రఘురామ కేసులో సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. వైద్య పరీక్షల కోసం ఆయన్ను సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని పేర్కొంది.

ఎంపీ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని.. వైద్య పరీక్షల పర్యవేక్షణకు జ్యుడీషియల్ అధికారిని నియమించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఏపీ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ హైకోర్టు, రిజిస్ట్రార్ జనరల్ ఆదేశాలు అమలు చేయాలని సుప్రీం ఆదేశాలిచ్చింది.

ఎంపీ వైద్య పరీక్షల్ని వీడియోగ్రఫీ చేసి సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించాలని సుప్రీం కోర్టు తెలిపింది. వైద్య పరీక్షల ఖర్చు ఎంపీనే భరించాలంది. అలాగే ఆయన వేసిన బెయిల్ పిటిషన్ శుక్రవారానికి వాయిదా వేసింది.

ఎంపీ రఘురామను శుక్రవారం సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్ తర్వాత పోలీసులు తనను తీవ్రంగా కొట్టారని రఘురామ ఆరోపించగా.. ఏపీ హైకోర్టు ఆయనకు గుంటూరు జీజీహెచ్‌లో వైద్యర పరీక్షలు నిర్వహించారు. డాక్టర్లు టీం పరీక్షలు నిర్వహించి రఘురామ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని హైకోర్టుకు తేల్చిచెప్పారు.  దీంతో ఆయన సుప్రీంను ఆశ్రయించారు.