మాజీ ఐఏఎస్ అధికారి రమేష్ కుమార్ ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఈ రోజు ఉదయం ముగ్గురు పోలీసుల బృందం హైదరాబాద్, కొండాపూర్‌లోని రమేష్ తల్లిదండ్రులు నివసిస్తున్న ఇంటికి చేరుకొని నోటీసులు ఇచ్చారు. ఓ కేసులో భాగంగా విచారణకు రావాలని నోటీసులు అందజేశారు. 2013లో ఏపీ సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌పై.. వేధింపులు, గృహహింస కింద ఆయన భార్య కేసు పెట్టారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో సునీల్‌కుమార్‌ను అరెస్ట్ చేయవద్దని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయిప్పటికీ.. తమపై కూడా గృహహింస కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని పీవీ రమేష్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.