డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ అందిస్తుంది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 150 ఖాళీలను భర్తీ చేయనుంది.
మొత్తం ఖాళీలు: 150
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 40, టెక్నీషియన్ (డిప్లొమా) 50, ట్రేడ్ అప్రెంటిస్ 60 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఈసీఈ, ఈఈఈ, సీఎస్ఈ, మెకానికల్, కెమికల్లో ఇంజినీరింగ్, బీకామ్, బీఎస్సీ, డిప్లొమా, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్ ట్రేడుల్లో ఐటీఐ చేసి ఉండాలి. అయితే అభ్యర్థులు 2019, 2020, 2021లో ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మెరిట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 7
వెబ్సైట్: https://rcilab.in