ఏ ఆర్‌ రెహమాన్‌ కి మరో అంతర్జాతీయ పురస్కారం..!

AR Rahman Received Cairo International Award
AR Rahman Received Cairo International Award

ప్రముఖ సంగీత దర్శకుడు ఏ. ఆర్‌. రెహమాన్‌ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. సంగీత రంగంలో ఆస్కార్‌ అవార్డుతో ఇప్పటికే అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న ఆయన 43వ కైరో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (CIFF) ప్రత్యేక పురస్కారం అందుకున్నారు. సినిమా, సంగీత రంగాల్లో రెహమాన్‌ చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది. కైరోలో ఆదివారం సిఫ్‌ ప్రెసిడెంట్‌ మొహమ్మద్‌ హెఫ్జి చేతుల మీదుగా ఆయన ఈ పురస్కార ట్రోఫీని అందుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు. సిఫ్‌ వేడుకలో దిగిన ఫొటోలు, ట్రోఫీలను పంచుకుంటూ ఈ అవార్డు అందజేసిన సిఫ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.