క్రెడిట్ కార్డులను క్లోనింగ్ చేసే ముఠా అరెస్ట్.. రూ.50 కోట్లకు పైగా మోసాలు

Cyberabad CP Stephen Ravindra

అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను క్లోనింగ్ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ  స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మొహాలీ, పంజాబ్ కి చెందిన ఏడుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాకి చెందిన నవీన్ బొటాని కీలక సూత్రధారిగా గుర్తించారు.

విదేశాల్లో ఉన్న వారికి క్రెడిట్ కార్డులను ఈ ముఠా సప్లై చేస్తుంది. ఆన్ లైన్ ద్వారా క్రెడిట్ కార్డ్ లను అమ్ముతుంది. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులను టార్గెట్ గా చేసుకొని ఇప్పటి వరకు రూ.50 కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

80 మందితో నకిలీ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసి, విదేశీయులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయ్యాయని బెదిరింపులకు పాల్పడుతోంది. వీరి కాల్స్ తో బయపడిపోయిన విదేశీయులు వీళ్ళు చెప్పినట్లు చేస్తున్నారు. విదేశీ క్రెడిట్ కార్డ్ కంపనీలకు ప్రాంఛైసీ ఉన్న భారతీయ బ్యాంక్ లకు ఈ ముఠా టోకరా వేస్తున్నట్లు గుర్తించినట్లు సీపీ వివరించారు. దుబాయ్ లో మరో రెండు ముఠాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ముఠా నుండి రూ.కోటి పదకొండు లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.