బెయిల్ కోసం బాంబే హైకోర్టుకెళ్లిన ఆర్యన్ ఖాన్

Aryan Khan files bail petition in Bombay High Court
Aryan Khan files bail petition in Bombay High Court

క్రూయిజ్ షిప్పులో డ్రగ్స్ వాడుతూ పట్టుబడిన నిందితుడు, బాలీవుడ్ షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. బెయిల్ కోసం ఆర్యన్ ఖాన్, అతడి స్నేహితులు ఆర్బాస్ ఖాన్, ఫ్యాషన్ మోడల్ మున్ మున్ ధనేచాలు దాఖలు చేసిన పిటిషన్లను మధ్యాహ్నం ముంబై స్పెషల్ కోర్టు తిరస్కరించింది. దీంతో.. ఆర్యన్ ఖాన్ తరపు న్యాయవాది కింది కోర్టు ఆర్డర్ ను సవాల్ చేస్తూ.. బాంబై హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు.

Aryan Khan files bail petition in Bombay High Court
Aryan Khan files bail petition in Bombay High Court

అక్టోబర్ 3న ముంబై తీరంలో క్రూయిజ్ షిప్పులో నిషేధిత డ్రగ్స్ వాడుతూ ఆర్యన్ ఖాన్, మరికొంతమంది పట్టుబడ్డారు. వారిని పోలీసులు కోర్టులో హాజరు పరుచగా కోర్టు వారికి కస్టడీ విధించింది. కాగా ఈ కేసులో పోలీసుల ఇంటరాగేషన్ పూర్తయింది. ప్రస్తుతం నిందితులు జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈరోజు ముంబై స్పెషల్ కోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించగా.. బాంబై హైకోర్టుకు ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నాడు.