నగ్నంగా ఆడిషన్ ఇవ్వమన్నడు. అతను అలాంటోడే. రాజ్ కుంద్రా పై బాలీవుడ్ నటి ఆరోపణలు

ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త, బిజినెస్ మెన్ రాజకుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అవటం బాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఐతే అతను అలాంటోడేనని మోడల్, నటి సాగరిక సోనా సుమన్ ఇచ్చిన ఒక ఇంటర్య్వూ ఇప్పుడు వైరల్ గా మారింది. సినిమాలు, వెబ్ సిరీస్ లలో చాన్స్ లు ఇప్పిస్తానంటూ కొంతమంది అమ్మాయిలను బలవంతంగా పోర్నో సినిమాలు తీయించాడంటూ రాజ్ కుంద్రాపై ఆరోపణలు వస్తున్నాయి. ఐతే తనకు రాజ్ కుంద్రాతో ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె ఇంటర్వ్యూ లో వివరించారు. నగ్నంగా ఆడిషన్ ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. సాగరిక సోనా ఆరోపణలతో అరెస్టైన రాజ్ కుంద్రా పై పోలీసులు పెట్టిన కేసుకు మరింత బలం చేకూరినట్లవుతోంది.

వీడియో కాల్ లో ఆడిషన్

మోడలింగ్ చేస్తూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా తనకు గతేడాది రాజ్ కుంద్రా వెబ్ సిరీస్ లో అవకాశం ఇస్తామని ఓ వ్యక్తి ఫోన్ చేశాడని సాగరిక చెప్పింది. ఉమేష్ కామత్ అనే వ్యక్తి తనకు ఫోన్ చేసి రాజ్ కుంద్రా పేరు చెప్పాడని కానీ అప్పటికీ తనకు ఆయనెవరో తెలియదని సాగరిక చెప్పారు. ఫోన్ చేసిన వ్యక్తే శిల్పాశెట్టి భర్తే రాజ్ కుంద్రా అని తనకు చెప్పినట్లు వివరించారు. కరోనా టైమ్ కావటంతో వీడియో కాల్ లోనే ఆడిషన్ ఉంటుందన్నారని అన్నారు.

నగ్నంగా ఉండమన్నరు

వెబ్ సిరీస్ లో చాన్స్ వస్తే ఫ్యూచర్ బాగుంటుందని వీడియో కాల్ లో ఆడిషన్ కు ఒప్పుకున్నానని సాగరిక చెప్పారు. ఐతే వీడియో లో కాల్ లో జాయిన్ అయ్యాక షాకింగ్ ఎక్స్ పీరియన్స్ అయ్యిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వీడియో కాల్ లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని..అందులో ఒకరు ముఖం కనిపించకుండా కవర్ చేసుకున్నారని అతనే రాజ్ కుంద్రా అని అన్నారు. వీడియో కాల్ లో మాట్లాడుతుండగానే నగ్నంగా ఆడిషన్ ఇవ్వాలని కోరారని..అందుకు నేను నో చెప్పానని ఆమె వివరించారు. నిజంగానే రాజ్ కుంద్రా అలాంటివాడేనని ఆమె అన్నారు. ఈ రాకెట్ గుట్టురట్టు చేసి రాజ్ కుంద్రాను శిక్షించాలని ఆమె కోరారు. అటు రాజ్ కుంద్రా ఆఫీస్ నుంచే పోర్న్ వీడియోలు అప్ లోడ్ కావటంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ కుంద్రా ప్రమేయంపై బలమైన ఆధారాలున్నాయని ముంబై పోలీసులు చెబుతున్నారు.