మ‌హారాష్ట్ర‌లో దారుణం.. బాలిక‌పై 29 మంది సామూహిక అత్యాచారం

Autodrivers who kidnapped and gang-raped a young woman in hyderabad

 

dumb young woman raped three youth in warangal district

మ‌హారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప‌దిహేను సంవ‌త్స‌రాల బాలిక‌పై ఒక‌రిద్ద‌రు కాదు.. ఏకంగా 29 మంది సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. థానే జిల్లాలోని దొంబివ్లి ప‌ట్ట‌ణానికి చెందిన బాలికను స్థానికంగా ఉన్న ఓ యువ‌కుడు ప్రేమిస్తున్నాడు.

ఈ క్ర‌మంలో ఆ బాలిక‌ను లొంగ‌దీసుకున్నాడు. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ఇద్ద‌రు శారీర‌కంగా కలిసి ఉన్న స‌మ‌యంలో ఆ కామాంధుడు వీడియోల‌ను తీశాడు. త‌న స్నేహితుల‌తో కూడా స‌న్నిహితంగా ఉండాల‌ని, లేదంటే ఆ వీడియోల‌ను బ‌య‌ట పెడుతాన‌ని బెదిరింపుల‌కు దిగాడు.

దొంబివ్లి, ముర్బాద్, బ‌ద్లాపూర్, రాబ‌లే, న‌వీ ముంబై ఇలా పలు ప్రాంతాల్లో 29 మంది ఆమెపై అత్యాచారం చేశారు. వారు పెట్టే బాధలు తట్టుకోలేక బాధితురాలు పోలీసుల‌ను ఆశ్రయించింది.

బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డిన 29 మందిలో 25 మందిని అరెస్టు చేసి పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసినట్టు మాన్‌పాడ పోలీసులు తెలిపారు. మిగతా వారి గురించి వెతుకుతున్నారు. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు.