రంగారెడ్డి జిల్లాలో దారుణం.. బలవంతంగా మద్యం తాగించి మహిళపై సామూహిక అత్యాచారం

Rajendranagar Police Station

Rajendranagar Police Station

రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పోలీస్ అకాడమీ దగ్గర వేచిఉన్న మహిళ(25)ను మద్యం మత్తులో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చి బలవంతంగా ఎక్కించుకొని తీసుకుపోయారు.

రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ దగ్గర ఉన్న లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలోని నిర్మానుష్య ప్ర‌దేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు.

మద్యం మత్తులో ఉన్న దుండగులు అమ్మాయితో కూడా బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం చేశారు. ఆ త‌ర్వాత మ‌హిళ వ‌ద్ద ఉన్న న‌గ‌దు, బంగారు ఆభ‌ర‌ణాల‌ను దొంగిలించి రోడ్డుపైన వ‌దిలేసి వెళ్లిపోయారు.

బాధిత మహిళ రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.