యూపీలో దారుణం.. కదులుతున్న కారులోనే యువతిపై అత్యాచారం

Rape of a young woman in a moving car

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మథురకు చెందిన 21 ఏళ్ల యువతిపై ఓ యువకుడు కదులుతున్న కారులోనే అత్యాచారానికి ఒడిగట్టాడు. మంగళవారం ఆగ్రాలో ఎస్సై పరీక్ష రాసి తిరిగి వస్తుండగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.

బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితుడు తేజ్‌వీర్‌ని గురువారం అరెస్టు చేశారు. ఈ కేసులో మరో నిందితుడు దిగంబర్‌ పరారీలో ఉన్నాడని మథుర రూరల్‌ ఎస్పీ శిరీష్‌ చంద్ర తెలిపారు. నిందితులిద్దరూ 22 నుంచి 25 ఏళ్ల వయసు వారేనని, హరియాణాలోని మాన్‌పూర్‌కి చెందినవారిగా గుర్తించారు.

తేజ్‌వీర్‌ సోషల్‌ మీడియా ద్వారా యువతితో పరిచయం చేసుకుని ఆమెను నమ్మించాడని పోలీసులు తెలిపారు. నిందితుడు యువతితో కలిసి ఎస్సై పరీక్ష రాసేందుకు ఆగ్రాకు వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో కారులోనే ఆమెపై కిరాతక చర్యకు పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు.