తగ్గేదేలే అంటోన్న వార్నర్‌

David Warner 'Pushpa' movie steps

ఆసీస్‌ బ్యాటర్‌, సన్‌రైజర్స్‌ మాజీ కెప్టెన్ డేవిడ్‌ వార్నర్‌ సోషల్‌ మీడియాలోనూ తగ్గేదేలే అంటున్నాడు. తాజాగా అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’సినిమాలో మరో పాటకు స్టెప్పులేసి అభిమానుల్ని మరోసారి ఫిదా చేశాడు.

శ్రీవల్లి సాంగ్‌కు డేవిడ్‌ వేసిన స్టెప్పుల వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటలో అచ్చంగా అల్లు అర్జున్‌ను గుర్తుకు తెచ్చేలా డేవిడ్‌ వేసిన స్టెప్పు అదిరిపోయింది.

‘పుష్పా.. వాట్‌ నెక్స్ట్’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాలో డేవిడ్‌ పోస్ట్‌ చేసిన ఈ వీడియోను మూడు గంటల వ్యవధిలోనే దాదాపు 8.8 లక్షల మందికి పైగా వీక్షించారు.

వార్నర్‌ డ్యాన్స్‌ చేయడంపై ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ కూడా స్పందించారు. నవ్వుతూ.. ఫైర్‌ ఎమోజీలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.