44 దేశాల్లోకి ‘బీ.1.617’.. పిల్లలపై అధిక ప్రభావం

corona cases today update
corona cases today update
corona virus
corona virus

దేశంలో సెకండ్‌వేవ్‌ కి కారణమైన కొత్తరకం కరోనా వైరస్ డబుల్‌ మ్యుటెంట్‌ ‘బీ.1.617’ ఇప్పటికే 44 దేశాలకు వ్యాపించినట్టు డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వేరియంట్ పిల్లలపై అధికప్రభావం చూపుతుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో సింగపూర్‌, తైవాన్‌ దేశాలు స్కూళ్లను మూసేస్తున్నాయి.

బ్రిటన్‌లో సెకండ్‌ వేవ్‌కు కారణమైన బీ.1.1.7 వేరియంట్‌ తో పోలిస్తే, ‘బీ.1.617’ వేరియెంట్‌ 50 శాతం ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు నిపుణులు వెల్లడించారు.

బీ.1.617 వేరియంట్‌ ను మూడు రకాలుగా బీ.1.617.1, బీ.1.617.2, బీ.1.617.3గా నిపుణులు విభజించారు. ఇందులో ‘బీ.1.617.2’ను మే 10న డబ్ల్యూహెచ్‌వో వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌ (ఆందోళన కలిగించే రకం)గా ప్రకటించింది.

‘బీ.1.617.2’ను భారత్‌, బ్రిటన్‌, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, జర్మనీ, ఇండోనేషియా, జపాన్‌, నేపాల్‌, సింగపూర్‌, దక్షిణాఫ్రికా, స్పెయిన్‌, థాయిలాండ్‌, అంగోలా, జోర్డాన్‌, ఉగాండా తదితర దేశాల్లో గుర్తించినట్టు డబ్ల్యూహెచ్‌వో వివరించింది.

‘బీ.1.617’ వేరియంట్‌ పై ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు సమర్థంగా పనిచేస్తున్నట్టు డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ ఇటీవల వెల్లడించారు. అన్ని దేశాలు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయాలన్నారు.